Chandrababu Naidu: దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు విందు... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Hosts IT Giants Dinner for Quantum Valley
  • రేపు క్వాంటం వ్యాలీపై సదస్సు
  • ఈ వర్క్ షాప్ లో పాల్గొనేందుకు వచ్చిన ఐటీ ప్రముఖులు
  • తన నివాసంలో డిన్నర్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ ఐటీ, బహుళజాతి కంపెనీల ప్రతినిధులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఇచ్చారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై సోమవారం జరగనున్న నేషనల్ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై చర్చించారు. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సీఎం వివరించారు.

సీఎం విందుకు హాజరైన ప్రముఖులు:
సీఎం చంద్రబాబు ఇచ్చిన విందుకు హాజరైన ప్రముఖుల్లో టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి. రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జె.బి.వి. రెడ్డి, రెడ్డీ ల్యాబ్స్ ఫణి మిత్ర, అస్ట్రా జెన్గా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. 

వీరితో పాటు అమెజాన్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్, తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ డిన్నర్ కు హాజరైన వారంతా సోమవారం విజయవాడలో జరగనున్న నేషనల్ క్వాంటం వర్క్ షాపులో పాల్గొననున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Quantum Valley
Amaravati
IT Companies
IBM
TCS
Microsoft India
National Quantum Mission
AP CM

More Telugu News