AP DSC: ఏపీ మెగా డీఎస్సీ... జులై 1, 2 తేదీల్లో పరీక్ష రాసేవారికి అప్ డేట్

AP DSC Hall Tickets Available for July 1 2 Exams
  • జూన్ 20,21 తేదీలలో నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ పరీక్ష 
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాయిదా పడిన వైనం
  • జులై 1,2 తేదీల్లో పరీక్షలు రాసే అభ్యర్ధులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలన్న అధికారులు 
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది. జులై 1, 2 తేదీలలో పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in నుండి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కారణంగా జూన్ 20, 21 తేదీలలో నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ పరీక్షలను అధికారులు వాయిదా వేసిన విషయం విదితమే. వాయిదా పడిన పరీక్షలను జులై 1, 2 తేదీలలో నిర్వహించనున్నారు.

జులై 1, 2 తేదీల్లో జరిగే పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చినందున, నూతన హాల్ టికెట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు కొత్త హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీలను నిర్ధారించుకుని పరీక్షకు హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు.

కాగా, ఆదివారం జరిగిన ప్రిన్సిపల్ పరీక్షకు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షకు మొత్తం 19,750 మంది అభ్యర్థులకు గాను 18,231 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 97.81 శాతం, నెల్లూరు జిల్లాలో 88.04 శాతం అత్యధిక హాజరు నమోదైందని వెల్లడించారు. 
AP DSC
AP DSC Hall Tickets
AP DSC Exam Date
Andhra Pradesh DSC
AP Education Department
School Assistant Telugu Exam
Mega DSC
APCFSS

More Telugu News