Devakumar: హైదరాబాదులో కనిపించకుండా పోయిన టెక్కీ!

Devakumar Software Engineer Missing in Hyderabad
  • ఆర్ధిక ఇబ్బందులతో ఇంటి నుంచి వెళ్లిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
  • తోటి ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా మేసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన దేవకుమార్
  • మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

మాతృశ్రీ నగర్‌లో నివాసం ఉండే దేవకుమార్ (40) ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గర్భిణి అయిన ఆయన అర్ధాంగి ప్రసవం నిమిత్తం పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దేవకుమార్ నిన్న తన సహచర ఉద్యోగులు కొందరికి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపి తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నాడు.

దేవకుమార్ మెసేజ్‌తో ఆందోళనకు గురైన సహచర ఉద్యోగులు అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అతని ఆచూకీకి సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Devakumar
Devakumar missing
Hyderabad techie missing
Miyapur police station
Software engineer missing
Financial problems
Missing case
Hyderabad news
Telangana news

More Telugu News