Father Stabs Son: వానలో ఆడుకుంటానన్న కొడుకును పొడిచి చంపిన తండ్రి.. ఢిల్లీలో దారుణం

Delhi Crime Father Stabs Son for Wanting to Play in Rain
  • వానలో ఆడుకుంటానని మారాం చేసిన పదేళ్ల బాలుడు
  • కోపంతో కత్తితో పొడిచిన కసాయి తండ్రి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి
దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వర్షంలో ఆడుకుంటానని మారాం చేసిన పదేళ్ల బాలుడిని క్షణికావేశంలో కత్తితో పొడిచాడో తండ్రి.. రక్తమోడుతున్న కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని డాబరీ ఏరియాలో రాయ్ అనే రోజుకూలీ తన నలుగురు పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. రాయ్ భార్య కొన్నేళ్ల క్రితం మరణించింది. ఈ క్రమంలో శనివారం రాయ్ పదేళ్ల కొడుకు వర్షంలో ఆడుకోవడానికి వెళ్తానని మారాం చేశాడు.

వద్దన్నా వినకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాయ్ వంటగదిలోని కత్తితో బాలుడి ఎడమ పక్కటెముకల కింద పొడిచాడు. క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడ్డ రాయ్.. ఆ తర్వాత వెంటనే కొడుకును ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే, గాయం కారణంగా అప్పటికే తీవ్ర రక్తస్రావం చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రాయ్ పై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Father Stabs Son
Delhi Crime
Father Arrested
Child Murder
Delhi Police
Domestic Violence
Crime News India
Dabri Delhi
Roy
Rain
Stabbing

More Telugu News