YS Jagan Mohan Reddy: నేడు తాడేపల్లికి జగన్

YS Jagan Mohan Reddy to Reach Tadepalli Today
  • ఈ రోజు సాయంత్రం 7.10 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్న జగన్
  • రోడ్డు మార్గంలో 7.40 గంటలకు తాడేపల్లి నివాసానికి
  • రేపు హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఆయన సాయంత్రం 4.50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని నివాసానికి రాత్రి 7.40 గంటలకు చేరుకుంటారు.

సింగయ్య  మృతికి సంబంధించిన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

గత విచారణ సందర్భంలో జగన్‌తో పాటు ఇతర వైకాపా నేతలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేపు వెలువడే ఉత్తర్వులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో రేపు వైఎస్ జగన్ తాడేపల్లిలో ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. 
YS Jagan Mohan Reddy
Tadepalli
Andhra Pradesh
YSRCP
Gannavaram Airport
AP High Court
Quash Petition
Road Accident Case

More Telugu News