Ramachandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా రామచంద్రరావు!

Ramachandra Rao Appointed as Telangana BJP President
  • బీజేపీ అధ్యక్ష పదవికి రామచంద్రరావును ఖరారు చేసిన పార్టీ అధిష్ఠానం
  • నామినేషన్ దాఖలు చేసిన రామచంద్రరావు
  • ఈ రోజు మధ్యాహ్నం అధికారిక ప్రకటన
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ రాష్ట్ర నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది.

పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రామచంద్రరావు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం అయింది. రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎంపిక లాంఛనప్రాయం అయింది.

పార్టీ అధ్యక్ష పదవి రేసులో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కె. లక్ష్మణ్, డీకే అరుణ, రాజా సింగ్ తదితరుల పేర్లు వినిపించినప్పటికీ, పార్టీ అధిష్టానం రామచంద్రరావు వైపు మొగ్గుచూపింది. పార్టీ అధ్యక్ష పదవిని ఆశించిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు.

రామచంద్రరావు పేరును ఆర్ఎస్ఎస్‌తో పాటు కొందరు సీనియర్ నేతలు బలంగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాలతో అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, ఇప్పటికే రామచంద్రరావుకు పలువురు పార్టీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

.
Ramachandra Rao
Telangana BJP
BJP Telangana
Bandi Sanjay
Dharmapuri Arvind
K Laxman
DK Aruna
Raja Singh
Telangana Politics
BJP President

More Telugu News