Golla Krishna: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం .. తండ్రి చేతిలో కుమారుడు హతం

Father Kills Son in Jaggayyapet NTR District Crime
  • మద్యం మత్తులో తల్లిదండ్రులను తరచు వేధిస్తున్న కుమారుడు వెంకటనారాయణ
  • మద్యం మత్తులో తండ్రి కృష్ణతో గొడవపడ్డ వెంకటనారాయణ
  • తండ్రి కృష్ణ చెక్కమొద్దుతో తలపై కొట్టడంతో మృతి చెందిన కుమారుడు వెంకటనారాయణ
  • జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో ఘటన
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తున్న కుమారుడిని కన్న తండ్రే హతమార్చాడు. షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన గోళ్ల కృష్ణ కుమారుడు వెంకట నారాయణకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి కుమారుడు, కుమార్తె సంతానం. ఐదు సంవత్సరాల క్రితం భార్య వదిలి వెళ్లిపోవడంతో వెంకట నారాయణ తన తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు.

మద్యానికి బానిసైన వెంకటనారాయణ గత కొంతకాలంగా మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. నిన్న రాత్రి కూడా మద్యం తాగి వచ్చి తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహానికి గురైన తండ్రి గోళ్ల కృష్ణ చెక్క దుంగతో తలపై బలంగా కొట్టడంతో వెంకటనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట నారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
Golla Krishna
NTR District
Jaggayyapet
Share Muhammad Peta
Son Murder
Crime News
Andhra Pradesh Crime
Drunken Son
Chilakallu Police
Domestic Violence

More Telugu News