Nithin: గత సినిమాలకు క్షమించండి.. ఇకపై మంచి చిత్రాలే చేస్తా: నితిన్ ఎమోషనల్

Nithin Apologizes for Past Films Promises Better Movies
  • ఈ నెల 4న విడుదల కానున్న నితిన్ చిత్రం 'తమ్ముడు'
  • నితిన్ సరసన నటించిన సప్తమి గౌడ
  • కీలక పాత్రను పోషించిన లయ
యంగ్ హీరో నితిన్ తన గత చిత్రాల ఫలితాలపై అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇకపై కేవలం మంచి సినిమాలతోనే ముందుకు వస్తానని మాటిచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నితిన్ భావోద్వేగానికి గురయ్యారు. నితిన్, సప్తమి గౌడ జంటగా నటించిన ‘తమ్ముడు’ చిత్రం జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ కార్యక్రమంలో నితిన్ మాట్లాడుతూ, "నేను ఈ సినిమా విజయం సాధించాలని ముగ్గురి కోసం బలంగా కోరుకుంటున్నాను. ఒకరు దర్శకుడు వేణు శ్రీరామ్, ఆయన ఈ సినిమా కోసం రెండేళ్లు ఎంతో శ్రమించారు. రెండోది, నన్ను ఇష్టపడే అభిమానుల కోసం. నా హిట్ చూసి ఆనందపడే, ఫ్లాప్ వస్తే బాధపడే వారి కోసం ఈ సినిమా గెలవాలి. ఇటీవల నా సినిమాలు మిమ్మల్ని నిరాశపరిచాయని నాకు తెలుసు. అందుకు అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఇకపై మంచి కథలతోనే మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నాను" అని అన్నారు. ‘తమ్ముడు’ చిత్రం అందరినీ తప్పకుండా సంతోషపెడుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ నితిన్‌కు అండగా నిలిచారు. "నితిన్ గత చిత్రాల ఫలితాలతో బాధలో ఉన్నాడు. కానీ ‘తమ్ముడు’తో అతను గట్టి కమ్‌బ్యాక్ ఇస్తాడు. ఎంత వేగంగా కింద పడ్డాడో అంతే వేగంగా పైకి లేస్తాడు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే వేదికపై ఆయన మరో కీలక ప్రకటన చేశారు. "ఈ ఏడాది ‘గేమ్ ఛేంజర్’ రూపంలో మాకు ఒక చిన్న లోటు మిగిలింది. రామ్ చరణ్‌తో ఒక సూపర్ హిట్ ఇవ్వలేకపోయామనే లోటు ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి ఆయనతో త్వరలోనే మరో మంచి సినిమా చేస్తాం. ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి, త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం" అని వెల్లడించారు.
Nithin
Nithin movies
Thammudu movie
Venu Sriram
Sapthami Gowda
Dil Raju
Ram Charan
Game Changer movie
Telugu cinema
Tollywood

More Telugu News