Harsha Roshan: ఇంటర్ స్టూడెంట్స్ ఇబ్బందులే వేరయా .. AIR సిరీస్ !

AIR Series Special
  • ఇంటర్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే 'AIR' 
  • ర్యాంకుల హడావిడిపై సాగే కథాకథనాలు 
  • వినోదం - సందేశం కలిసి కనిపించే సిరీస్ 
  • ఈ నెల 3వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో  స్ట్రీమింగ్ 
      
ఈ మధ్య కాలంలో పిల్లలు .. వాళ్ల చదువులు .. ఆ ఫ్యామిలీలు ఎదుర్కుంటున్న సమస్యలపై వస్తున్న సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉంటూ కనెక్ట్ కావడం వల్లనే ఇటువంటి కంటెంట్ల సంఖ్య నిదానంగా పెరుగుతూ వెళుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సిరీస్ గా 'AIR' ( ఆల్ ఇండియా ర్యాంకర్స్) కనిపిస్తుంది.

హర్ష రోషన్ .. భానుప్రతాప్ .. సింధూ రెడ్డి .. జయతీర్థ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 3వ తేదీ నుంచి ఈటీవీ విన్ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఇంటర్ స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. ఇటీవల కాలంలో 'కోర్ట్' సినిమాతో హర్ష రోషన్ కి వచ్చిన క్రేజ్, ఈ సినిమాకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. 

ఇంటర్ కుర్రాళ్లను చాలా ఇబ్బంది పెట్టే అంశం ర్యాంకులు. కాలేజ్ లు ర్యాంకుల విషయంలో చాలా హడావిడి చేస్తాయి. ఆ ర్యాంకుల కోసం పేరెంట్స్ అదే పనిగా పిల్లలను ఒత్తిడి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని రూపొందించిన సిరీస్ ఇది. బ్యాక్ బెంచ్ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతూ సరదాగా నవ్విస్తుంది .. ఆలోచింపజేస్తుంది. చూడాలి మరి ఈ సిరీస్ కి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో. 

Harsha Roshan
AIR series
All India Rankers
ETV Win
Telugu web series
Inter students
Student life
Rank pressure
Joseph Clinton
Bhanu Pratap

More Telugu News