Sagar: పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వస్తున్న 'మొగలిరేకులు' ఆర్కే నాయుడు!

The 100 Movie Special
  • సాగర్ హీరోగా రూపొందిన 'ది 100'
  • యాక్షన్ - ఎమోషన్ కలిసి నడిచే కథ
  • క్రియా ఫిలిమ్స్ కార్ప్ నుంచి మరో సినిమా 
  • ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల  

పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలలో రాణించిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనే  చెప్పాలి. ఎందుకంటే ఈ తరహా పాత్రల నుంచి ఆడియన్స్ కోరుకునే బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. తమిళంలో విజయ్ కాంత్ .. మలయాళంలో సురేశ్ గోపి .. తెలుగులో రాజశేఖర్ ఈ తరహా పాత్రలలో తమదైన మార్క్ చూపించారు. ఇక ఈ జనరేషన్ హీరోలు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలలో తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. 
   
ఇంతకుముందు అడవి శేష్ .. రామ్ .. శ్రీ విష్ణు ప్రయత్నించగా, రీసెంట్ గా నాని కూడా 'హిట్ 3' సినిమాలో తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు హీరో 'సాగర్' వంతు వచ్చింది. 'మొగలిరేకులు' సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ 'ఆర్ కె నాయుడు'గా సాగర్ మెప్పించాడు. ఈ పాత్రలో తన నటనకుగాను ఆయన 'మెగా మదర్' నుంచి మంచి మార్కులు కొట్టేశాడంటే అర్థం చేసుకోవచ్చు. పోలీస్ పాత్రలకు సాగర్ కరెక్టుగా సెట్ అవుతాడని అప్పుడే అంతా అనుకున్నారు. 

ఇంతకుముందు సాగర్ పోలీస్ ఆఫీసర్ గా చేసినప్పటికీ, ఆ పాత్రను ఆవిష్కరించిన తీరువేరు. ఆయన తాజా చిత్రమైన 'ది 100' సినిమాలో మాత్రం పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో తనకి మరింత మంచి పేరు వస్తుందనే బలమైన నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఈ కథలో కొత్త పాయింట్ ఉందనీ, అది ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుందని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ చెబుతున్నాడు. రమేశ్ కరుటూరి - వెంకీ పూషడపు - జె.తారక్ రామ్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన థియేటర్లకు రానుంది.     
Sagar
The 100 Movie
RK Naidu
Telugu cinema
Raghav Omkar Shashidhar
Ramesh Karuturi
Venky Pushadapu
Telugu movies 2024
Police officer role

More Telugu News