AP Government: ఆ అధ్యాపకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Government Announces Good News for Teachers
  • గిరిజన గురుకులాల్లో బోధనా సిబ్బందికి వేతనాల పెంపు
  • ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
  • జూనియర్ లెక్చరర్లు, పీడీ (సీ), లైబ్రేరియన్లు, పీజీటీల వేతనాలు
గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ బోధనా సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

గురుకులాల్లో పనిచేస్తున్న మొత్తం 1659 మంది బోధనా సిబ్బందికి ఈ వేతనాల పెంపు వర్తిస్తుంది. కేటగిరీ ఏ కింద ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. జూనియర్ లెక్చరర్లు, పీడీ (సీ), లైబ్రేరియన్లు, పీజీటీల వేతనాన్ని రూ.24,150 లకు, టీజీటీ, పీడీ (ఎస్) వేతనాలను రూ.19,350 లకు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ సిబ్బంది వేతనాన్ని రూ.16,300 లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
AP Government
Andhra Pradesh Government
Tribal Gurukula Schools
AP Teachers Salary Hike
AP Education News
AP Government Jobs
Outsourcing Teachers
Teachers Salary
Gurukula Schools

More Telugu News