Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కలకలం .. 15 మంది సీనియర్‌లపై వేటు

Mangalagiri AIIMS Ragging Incident 15 Seniors Suspended
  • మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ పై బాధితుడి ఫిర్యాదు
  • 15 మంది సీనియర్ విద్యార్ధులను సస్పెండ్ చేసిన అధికారులు
  • ఆలస్యంగా వెలుగులోకి
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో సీనియర్ విద్యార్థులు ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేయటం తీవ్ర కలకలం రేపింది. తిరుపతికి చెందిన ఓ జూనియర్ విద్యార్థిపై 15 మంది సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితుడి ఫిర్యాదుతో ర్యాగింగ్‌కు పాల్పడిన 15 మంది సీనియర్లపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. గత నెల 22న హాస్టల్‌లోని స్నేహితులతో తిరుపతికి చెందిన విద్యార్థి మాట్లాడుతుండగా, గదిలో ఉన్న మిగిలిన విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై బాధిత విద్యార్థి తన మనసు గాయపరిచేలా వ్యవహరించారని అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు విచారణ జరిపి మరుసటి రోజే 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. అయితే, ర్యాగింగ్‌కు సంబంధించి బాధిత విద్యార్థి ఫిర్యాదును, సీనియర్లను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని యాజమాన్యం వెంటనే బహిర్గతం చేయకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ర్యాగింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. 
Mangalagiri AIIMS
AIIMS Mangalagiri
Ragging
Andhra Pradesh
Guntur
Student Ragging
Medical College Ragging
Ragging Complaint
Suspension

More Telugu News