Vinesh Phogat: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వినేశ్ ఫోగట్

Wrestler Vinesh Phogat Delivers Healthy Baby Boy
  • ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ప్రసవం
  • తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపిన కుటుంబ సభ్యులు
  • హర్యానాలోని జులానా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వినేశ్
  • ఒలింపిక్స్‌లో నిరాశ, రాజకీయాల్లో విజయం తర్వాత కొత్త ఆనందం
భారత స్టార్‌ రెజ్లర్, హర్యానా ఎమ్మెల్యే వినేశ్ ఫోగట్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె తన తొలి సంతానానికి జన్మనివ్వగా, తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. వినేశ్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా రెజ్లరే కావడం గమనార్హం.

ఈ శుభవార్తను వినేశ్ అన్నయ్య హర్విందర్ ఫోగట్ మీడియాకు తెలిపారు. "వినేశ్ ఈ ఉదయం బాబుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మా కుటుంబానికి ఇది అత్యంత సంతోషకరమైన క్షణం" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే వినేశ్‌ను సోమ్‌వీర్ ఇంటికి తీసుకువస్తామని, ఆమెను, బాబును చూసేందుకు తమ స్వగ్రామమైన బలాలీలోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.

మార్చి నెలలోనే వినేశ్ తన గర్భం గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "మా ప్రేమకథలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతోంది" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ అప్పట్లో అభిమానులను, క్రీడాకారులను ఎంతగానో ఆకట్టుకుంది.

గత కొంతకాలంగా వినేశ్ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదురయ్యాయి. గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో బరువు నిబంధనలు ఉల్లంఘించడంతో 50 కేజీల విభాగం ఫైనల్ నుంచి అనర్హతకు గురై తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ ఘటన తన క్రీడా జీవితంలో అతిపెద్ద గాయం అని ఆమె అభివర్ణించారు. 

ఆ తర్వాత ఆమె తన ప్రయాణాన్ని రాజకీయాల వైపు మళ్లించారు. గత సెప్టెంబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై విజయం సాధించారు.
Vinesh Phogat
Wrestler
Indian wrestler
Haryana MLA
Baby born
Son born
Somveer Rathi
Indian National Congress
Julana constituency
Haryana Assembly elections

More Telugu News