Jasprit Bumrah: టీమిండియా-ఇంగ్లండ్ రెండో టెస్టు ప్రారంభం... బుమ్రాకు రెస్ట్!

Jasprit Bumrah rested for India vs England 2nd Test
  • భారత్-ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్
  • నేటి నుంచి రెండో టెస్టు... వేదికగా ఎడ్జ్ బాస్టన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఇంగ్లండ్
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టెస్టు ప్రారంభమైంది. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. కాగా, ఈ మ్యాచ్ లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. తరచూ గాయపడుతున్న బుమ్రాను... సిరీస్ లో చివరివరకు కాపాడుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో టెస్టు కోసం బుమ్రా స్థానంలో పేసర్ ఆకాశ్ దీప్ కు తుదిజట్టులో స్థానం కల్పించారు. అంతేకాకుండా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఆంధ్రా ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు.

మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 12, కేఎల్ రాహుల్ 1 పరుగుతో ఆడుతున్నారు. ఈ సిరీస్ లోని తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 
Jasprit Bumrah
India vs England
India England 2nd Test
Edgbaston Test
Akash Deep
Nitish Kumar Reddy
Yashasvi Jaiswal
KL Rahul
Indian Cricket Team
England Cricket Team

More Telugu News