Pawan Kalyan: తమిళనాడులో పవన్ కల్యాణ్ పై కేసు... ఏపీ బీజేపీ చీఫ్ స్పందన

Case Filed Against Pawan Kalyan in Tamil Nadu AP BJP Chief Reacts
  • మధురైలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
  • పవన్‌పై కేసు నమోదును మురుగన్‌పై దాడిగా భావిస్తామన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తమిళనాడులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల తమిళనాడులో పర్యటించిన పవన్ కల్యాణ్ అక్కడ నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో పాల్గొన్నారు. మధురైలో జరిగిన సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై పోలీసులు పవన్‌పై కేసు నమోదు చేశారు.

ఈ విషయంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పందించారు. తమిళనాడులో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పవన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవ్, దీనిని మురుగన్‌పై దాడిగా భావిస్తామని పేర్కొన్నారు.

తమిళనాడు బీజేపీ రాష్ట్ర నేత అన్నామలైకి అండగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారని ఆయన అన్నారు. వారిద్దరికీ అండగా ఉంటామని మాధవ్ తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమని మాధవ్ జోస్యం చెప్పారు. 
Pawan Kalyan
Tamil Nadu
AP BJP
PVN Madhav
Annamalai
DMK
Tamil Nadu Politics
BJP
Case Filed
Political Speech

More Telugu News