Tirupati Govindaraja Swamy Temple: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం

Tirupati Govindaraja Swamy Temple Fire Accident
  • తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం
  • రెండు దుకాణాలు, చలువ పందిళ్లు దగ్ధం
  • విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్న అధికారులు
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఈ రోజు వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గరలో ఉన్న రెండు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొదట ఒక దుకాణంలో మంటలు చెలరేగగా, ఆ తర్వాత అవి పక్క దుకాణానికి, ఆలయం ముందు వేసిన చలువ పందిళ్లకు వ్యాపించాయని చెబుతున్నారు.

భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా దుకాణాల్లోని ఇత్తడి సామాన్లు, బొమ్మలు కాలిపోయాయి. ఒక దుకాణంలో విద్యుత్ షాక్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
Tirupati Govindaraja Swamy Temple
Tirupati fire accident
Govindaraja Swamy Temple fire
Andhra Pradesh fire
Tirupati news
Temple fire
Fire accident
Shop fire

More Telugu News