Kashi Yatra: లారీని ఢీ కొట్టిన కాశీ యాత్రికుల బస్సు.. వినుకొండలో ప్రమాదం

Kashi Yatra Bus Hits Lorry Driver Dead in Vinukonda Accident
  • లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి, పది మంది యాత్రికులకు గాయాలు
  • ఇద్దరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
  • కర్నూలు-గుంటూరు హైవేపై నిలిచిన ట్రాఫిక్
పల్నాడు జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. రాయచూరు నుంచి కొందరు యాత్రికులు ఓ ప్రైవేట్ బస్సులో కాశీ యాత్రకు బయలుదేరారు. వీరి బస్సు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్దకు రాగానే, కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. నరసరావుపేట నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మరణించారు.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మంది యాత్రికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై సుమారు అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Kashi Yatra
Kashi Yatra bus accident
Palnadu district
Vinukonda
Road accident
Bus accident
lorry accident
Andhra Pradesh road accident
National Highway
Rayachur

More Telugu News