Komatireddy Venkat Reddy: కేటీఆర్, హరీశ్ రావు కాదు.. కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy Says KTR Harish Rao Not His Level
  • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
  • కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే చర్చకు సిద్ధమని స్పష్టీకరణ
  • కేటీఆర్, హరీశ్ రావులను తాము లెక్కలోకి తీసుకోబోమని వ్యాఖ్య
  • హరీశ్ రావు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని ఎద్దేవా
  • తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని పునరుద్ఘాటన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన వస్తే ప్రతిపక్షాలు కోరుతున్న అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఉన్నతాధికారులతో రోడ్ల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులను తాము అసలు లెక్కలోకే తీసుకోవడం లేదని కోమటిరెడ్డి అన్నారు. "నేను హరీశ్ రావు, కేటీఆర్ మీద మాట్లాడను. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడతాను. వీరు ఫ్లోర్ లీడర్లు ఏమీ కాదు. మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమంలో తాము కీలక పాత్ర పోషించామని, రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ తప్పుఒప్పులపై చర్చించాలంటే ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేశారు. 
Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy comments
Telangana roads development

More Telugu News