KCR: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి

- అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్
- సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత
- రక్తంలో చక్కెర అధికం, సోడియం స్థాయులు తక్కువగా ఉన్నట్టు గుర్తింపు
- ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
నీరసం కారణంగా ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కేసీఆర్ రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయులు అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.