Chevireddy Bhaskar Reddy: విజయవాడ జైల్లో చెవిరెడ్డి హ‌ల్‌చ‌ల్‌.. సెల్‌ తలుపును తన్నుతూ వీరంగం!

Chevireddy Bhaskar Reddy Creates Ruckus in Vijayawada Jail
  • మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైసీపీ నేత చెవిరెడ్డి
  • అనుచరులను గుంటూరు జైలుకు పంపడంపై అసహనం
  • జైలు గది తలుపును కాలితో తన్నుతూ గట్టిగా కేకలు
  • అరెస్టు అయిన నాటి నుంచి ఇదే తరహా ప్రవర్తన అని వెల్లడి
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జిల్లా జైల్లో తీవ్ర ఆగ్రహంతో ప్రవర్తించారు. తన అనుచరులను వేరే జైలుకు తరలించడంతో సహనం కోల్పోయి, తాను ఉంటున్న గది తలుపును కాలితో తన్నుతూ గట్టిగా అరుస్తూ విప‌రీతంగా ప్ర‌వ‌ర్తించారు.

వివరాల్లోకి వెళితే... ఇదే కేసులో అరెస్టయిన చెవిరెడ్డి అనుచరులు బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణలకు ఏసీబీ కోర్టు బుధవారం రాత్రి రిమాండ్ విధించింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ అధికారులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చెవిరెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. తన అనుచరులను విజయవాడ జైలుకు తీసుకురాకుండా, గుంటూరుకు ఎలా పంపుతారని ప్రశ్నిస్తూ ఆయన జైల్లో హల్‌చ‌ల్‌ చేసినట్లు తెలిసింది.

అరెస్టు అయిన నాటి నుంచి ఇదే తరహా ప్రవర్తన 
గత నెలలో అరెస్టయినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరచూ ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. అరెస్టు చేసిన రోజు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు, కోర్టులో రిమాండ్ విధించిన తర్వాత జైలుకు తరలిస్తున్న సమయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారు. సిట్ అధికారులు విచారణ కోసం కస్టడీకి తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు కూడా వారిపై అరిచినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తనవారిని వేరే కారాగారానికి పంపారన్న ఆక్రోశంతోనే ఆయన తాజాగా మరోసారి ఆగ్రహంతో ఊగిపోయినట్టు సమాచారం.
Chevireddy Bhaskar Reddy
Vijayawada jail
liquor scam case
ACB court
Guntur jail
YSRCP leader
Balaji Kumar Yadav
Naveen Krishna
remand
Andhra Pradesh politics

More Telugu News