Transgender Woman: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లింగ మార్పిడి చేయించి.. చివరికి మోసం!

Transgender Woman Files Rape Case After Being Cheated
  • ప్రియుడి కోసం లింగ మార్పిడి చేయించుకున్న యువకుడు
  • శస్త్రచికిత్స తర్వాత పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
  • అత్యాచారం, వేధింపుల కింద కేసు నమోదు
  • పదేళ్లుగా ప్రేమించుకుంటున్న మధ్యప్రదేశ్ జంట
ప్రేమించిన వ్యక్తి కోసం లింగ మార్పిడి చేయించుకుంటే, అతడు పెళ్లికి నిరాకరించి శారీరకంగా వేధించాడంటూ 25 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై అత్యాచారం, వేధింపుల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైసెన్ జిల్లా ఒబేదుల్లాగంజ్‌కు చెందిన బాధితురాలు, నర్మదాపురానికి చెందిన నిందితుడు పదేళ్ల క్రితం కలుసుకున్నారు. ఇద్దరూ స్వలింగ సంపర్కులు కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. ఆపై చాలాకాలం పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు.. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ప్రియుడి మాట నమ్మి ఇండోర్‌లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని యువతిగా మారింది. అయితే, సర్జరీ జరిగిన కొన్ని నెలలకే నిందితుడు ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి ప్రస్తావన తేగా, ముఖం చాటేసి చివరకు నిరాకరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం భోపాల్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు క్షుద్రపూజలు కూడా చేస్తాడని, లింగ మార్పిడికి ముందే తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు ఆరోపించినట్టు పోలీసులు వివరించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, లింగ మార్పిడి జరిగినట్టు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.  
Transgender Woman
Transgender
Gender Reassignment Surgery
Love Fraud
Sexual Assault
Narmadapuram
Raisen District
Bhopal Police
India Crime
Cheating

More Telugu News