PM Modi: ట్రినిడాడ్ ప్రధానికి మోదీ ప్రత్యేక కానుక

PM Modi presents Ram Mandir replica and holy water from Saryu river to Trinidad and Tobago PM
  • ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ప్రధాని మోదీ
  • ఆ దేశ ప్రధానికి అయోధ్య రామమందిర నమూనా బహూకరణ
  • సరయూ నది, మహాకుంభమేళా పవిత్ర జలాలను అందించిన ప్రధాని
  • సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న సోహరి ఆకుపై ప్రత్యేక విందు
  • ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక బంధాలకు ఇది నిదర్శనం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోతో మన దేశానికి ఉన్న బలమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను చాటిచెప్పారు. తన పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేస్సర్ కు అయోధ్య రామ మందిర నమూనాను ప్రత్యేక కానుకగా అందజేశారు. 

రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రినిడాడ్ వెళ్లిన ప్రధాని మోదీ గౌరవార్థం ప్రధాని కమలా ప్రసాద్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ, అయోధ్య రామాలయ నమూనాతో పాటు పవిత్ర సరయూ నదీ జలాన్ని, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా తీర్థాన్ని కూడా వారికి బహూకరించారు. ఈ బహుమతులు భారత్-ట్రినిడాడ్ మధ్య ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’  (ట్విట్ట‌ర్‌) వేదికగా పేర్కొన్నారు.

ఈ విందులో మరో విశేషం కూడా ఉంది. భారతీయ మూలాలున్న ప్రజలు పవిత్రంగా భావించే సోహరి ఆకుపై ఆహారాన్ని వడ్డించారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఇలా ఆకుపై భోజనం చేయడం అక్కడి సంప్రదాయం. తన పర్యటనలో భాగంగా మోదీ భోజ్‌పురి చౌతాల్ సంగీత ప్రదర్శనను తిలకించారు. కొన్నేళ్ల క్రితం గాంధీ 150వ జయంతి సందర్భంగా ‘వైష్ణవ జన తో’ గీతాన్ని ఆలపించిన స్థానిక గాయకుడు రాణా మోహిప్‌ను కలిసి అభినందించారు.
PM Modi
Trinidad and Tobago
Kamla Prasad Bissessar
Ayodhya Ram Mandir
Sarayu River
Indian Culture
Pravasi Bharatiya Divas
Bhojpuri Chautal
Vaishnava Janato
India Trinidad Relations

More Telugu News