Gomathi: అనుమానంతో కౌన్సిలర్ ను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త

Avadi Councilor Gomathi Killed by Husband Over Suspicion
  • తమిళనాడులోని అవడిలో కౌన్సిలర్ దారుణ హత్య
  • భార్యపై అనుమానంతో భర్త స్టీఫెన్ రాజు ఘాతుకం
  • మరో వ్యక్తితో మాట్లాడుతుండగా చూసి దాడి
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమె మరో వ్యక్తితో మాట్లాడుతోందన్న ఆగ్రహంతో నడిరోడ్డుపైనే కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని అవడిలో చోటుచేసుకుంది. మృతురాలు స్థానిక కౌన్సిలర్ కావడం గమనార్హం.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, అవడి జిల్లాకు చెందిన గోమతి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీ తరఫున కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త స్టీఫెన్ రాజు. తిరునిన్రావూర్ ప్రాంతంలోని జయరామ్ నగర్ వద్ద గోమతి మరో వ్యక్తితో నిలబడి మాట్లాడుతుండగా స్టీఫెన్ రాజు చూశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.

భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ స్టీఫెన్ రాజు నిలదీయడంతో గొడవ మరింత ముదిరింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు, తన వెంట తెచ్చుకున్న కత్తితో గోమతిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో గోమతి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. భార్యను హత్య చేసిన అనంతరం స్టీఫెన్ రాజు నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గోమతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్టీఫెన్ రాజును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Gomathi
Avadi
Tamil Nadu
Councilor Murder
Husband Arrested
Extra Marital Affair
Stephen Raju
VCK Party
Crime News
India

More Telugu News