Lakshmi Narayan Singh: మద్యం మత్తులో బాలికలతో హెడ్మాస్టర్ అనుచిత డ్యాన్స్... సస్పెండ్ చేసిన అధికారులు

Lakshmi Narayan Singh Headmaster Suspended for Drunk Dance With Students
  • ఛత్తీస్‌గఢ్‌లోని పశుపతిపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘటన
  • మొబైల్‌లో పాటలు పెట్టి బాలికలతో కలిసి అనుచితంగా నృత్యం
  • తరచూ తాగి వచ్చి కొడతాడని విద్యార్థుల ఆరోపణ
  • వీడియో వైరల్ కావడంతో హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
  • ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశం
గురువంటే విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన వాడు. కానీ, ఆ స్థానానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. మద్యం మత్తులో తరగతి గదిలోనే విద్యార్థినులతో అనుచితంగా డ్యాన్స్ చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర దుమారం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి అతడిని సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే, బలరాంపూర్ జిల్లా వాడ్రాఫ్‌నగర్ పరిధిలోని పశుపతిపూర్ ప్రాథమిక పాఠశాలలో లక్ష్మీ నారాయణ్ సింగ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడు తరగతి గదిలో తన మొబైల్ ఫోన్‌లో పాటలు పెట్టి, మద్యం మత్తులో విద్యార్థినులతో కలిసి అనుచితంగా డ్యాన్స్ చేశాడు. పాఠశాల సిబ్బందిలో ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియో వైరల్ అవ్వడంతో విద్యార్థుల నుంచి మరిన్ని ఫిర్యాదులు అందాయి. లక్ష్మీ నారాయణ్ సింగ్ తరచూ పాఠశాలకు మద్యం తాగి వస్తాడని, ఎలాంటి కారణం లేకుండా తమను శారీరకంగా దండిస్తాడని విద్యార్థులు ఆరోపించారు.

ఈ ఘటనపై, విద్యార్థుల ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) డీఎన్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నారాయణ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతడిని బలరాంపూర్‌లోని డీఈవో కార్యాలయానికి అటాచ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే శకుంతల పోర్టే కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంత నీచంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Lakshmi Narayan Singh
Chhattisgarh
headmaster
drunk dance
students
school
suspension
Balrampur
sexual harrasment
প্রাথমিক বিদ্যালয়

More Telugu News