Nellore Rottela Panduga: రొట్టెల పండుగకు ముస్తాబైన నెల్లూరు.. విస్తృతస్థాయిలో ఏర్పాట్లు

Nellore Rottela Festival Set to Begin Arrangements in Full Swing
  • మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షహీద్ దర్గాలో వేడుకలు
  • కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే భక్తులు
  • భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న కూటమి ప్రభుత్వం
  • సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ప్రసిద్ధ నెల్లూరు రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కులమతాలకు అతీతంగా దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులతో నెల్లూరు నగరం సందడిగా మారనుంది.

తమ కోరిక నెరవేరాలని ఆశిస్తూ భక్తులు ఇక్కడి స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్చుకోవడం ఈ పండుగలోని ప్రధాన ఘట్టం. గతేడాది కోరిక తీరిన భక్తులు కృతజ్ఞతగా రొట్టెను చెరువులో వదలగా, కొత్తగా మొక్కుకున్న వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. సంతానం, ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం వంటి విభిన్న కోరికల కోసం ఇక్కడ రొట్టెలను మార్చుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

ఈ పండుగ వెనుక ఓ చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. 1751లో ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ అరేబియా నుంచి వచ్చిన 12 మంది వీరులు, స్థానికులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందారని చరిత్ర చెబుతోంది. వారిని ఖననం చేసిన పవిత్ర స్థలమే నేటి బారా షహీద్ (పన్నెండు మంది వీరులు) దర్గాగా ప్రసిద్ధి చెందింది.

భక్తుల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్నానపు గదులు, మహిళలకు ప్రత్యేక వస్త్రధారణ గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దొంగతనాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సందల్ మాలి, రెండో రోజు గంధ మహోత్సవం, మూడో రోజు ప్రధాన ఘట్టమైన రొట్టెల మార్పిడి కార్యక్రమం నిర్వహిస్తారు.
Nellore Rottela Panduga
Rottela Panduga
Nellore
Bara Shaheed Dargah
Rottela Festival
Andhra Pradesh Festivals
Swarnala Cheruvu
Religious Harmony
Hindu Muslim Unity
Nellore Tourism

More Telugu News