Pat Cummins: సూప‌ర్‌మ్యాన్‌లా దూకిన క‌మ్మిన్స్.. నమ్మశక్యం కాని క్యాచ్.. నోరెళ్లబెట్టిన బ్యాటర్!

at Cummins Takes Stunning Catch in Australia vs West Indies Test
  • ఆస్ట్రేలియా, వెస్టిండీస్ రెండో టెస్టులో అద్భుతం
  • ప్యాట్ కమ్మిన్స్ స్టన్నింగ్ కాటన్ బౌల్డ్ క్యాచ్
  • ముందుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో బంతిని అందుకున్న ఆసీస్ కెప్టెన్
  • నిరాశగా వెనుదిరిగిన విండీస్ బ్యాటర్ కేసీ కార్టీ 
  • థర్డ్ అంపైర్ రివ్యూ తర్వాత వికెట్ ఖరారు
ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఓ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తన అసాధారణ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముందుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకున్న ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కేసీ కార్టీని పెవిలియన్ దారి పట్టించాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే... మ్యాచ్ రెండో రోజు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 9వ ఓవర్‌ను ప్యాట్ కమ్మిన్స్ వేశాడు. ఆ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేసీ కార్టీ ఓ బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని ప్యాడ్స్‌ను తాకి గాల్లోకి లేచింది. తన ఫాలోత్రూలో ఉన్న కమ్మిన్స్ మెరుపు వేగంతో స్పందించాడు. బంతి నేలను తాకకముందే ముందుకు దూకి, ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.

ఈ ఊహించని పరిణామంతో ఫీల్డ్ అంపైర్లు సైతం కాస్త తడబడ్డారు. క్యాచ్‌పై స్పష్టత కోసం నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు కోణాల్లో రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్, కమ్మిన్స్ అందుకున్నది క్లీన్ క్యాచ్ అని నిర్ధారించి కార్టీని ఔట్‌గా ప్రకటించారు. దీంతో కార్టీ నిరాశగా మైదానాన్ని వీడాడు. ప్ర‌స్తుతం క‌మ్మిన్స్ స్ట‌న్నింగ్ క్యాచ్ తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 
Pat Cummins
Cummins catch
Pat Cummins catch
Australia vs West Indies
Kacy Carty
cricket catch
amazing catch
cricket highlights
second test match

More Telugu News