Anwar Qadri: హిందూ యువతులకు వల వేస్తే రూ. 2 లక్షలు.. కాంగ్రెస్ కౌన్సిలర్‌పై తీవ్ర ఆరోపణలు

Love Jihad Allegations Against Congress Councilor Anwar Qadri
  • కాంగ్రెస్ కౌన్సిలర్‌పై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు
  • ప్రేమ పేరుతో హిందూ యువతులను వలలో వేసేందుకు డబ్బులిచ్చారనే ఆరోపణలు
  • ముగ్గురు నిందితుల విచారణలో బయటపడిన కౌన్సిలర్ పేరు
  • పరారీలో ఉన్న నిందితుడు.. రూ. 10 వేల రివార్డు ప్రకటించిన పోలీసులు
  • కౌన్సిలర్‌ను ఎన్‌కౌంటర్ చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే 
మధ్యప్రదేశ్‌లో ‘లవ్ జిహాద్’ కుట్రకు సంబంధించిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రేమ పేరుతో హిందూ యువతులకు వల వేసి, మతం మార్చేందుకు ముస్లిం యువకులకు డబ్బులు ఇచ్చారనే తీవ్ర ఆరోపణలపై ఇండోర్‌కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేశారు.  

ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు యువకులు తమకు అన్వర్ ఖాద్రీయే డబ్బులు ఇచ్చారని పోలీసుల విచారణలో చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని, వారిని వివాహం చేసుకుని ఇస్లాంలోకి మార్చేందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఖాద్రీ చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. మతం దాచిపెట్టి మోసం చేసి తమపై లైంగికదాడికి పాల్పడ్డారంటూ రెండు వారాల క్రితం ఇద్దరు హిందూ యువతులు బంగాంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కుట్ర బయటపడింది. 

ఈ ఫిర్యాదుతో పోలీసులు సాహిల్ షేక్, అల్తాఫ్ అలీ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో వీరు ఖాద్రీ పేరు చెప్పడంతో ఆయనపై మత స్వేచ్ఛ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఖాద్రీ పరారీలో ఉండగా, ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ. 10,000 రివార్డును పోలీసులు ప్రకటించారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. పరారీలో ఉన్న కౌన్సిలర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ తీవ్రంగా స్పందించారు. ఖాద్రీని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ కూడా సామాజిక సామరస్యానికి ముప్పు వాటిల్లుతున్నందునే ఎన్‌ఎస్‌ఏ ప్రయోగించినట్టు ధ్రువీకరించారు. ఆధారాల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని పోలీసులు తెలిపారు.
Anwar Qadri
Love Jihad
Madhya Pradesh
Hindu girls
religious conversion
Congress councilor
crime
National Security Act
Mohan Yadav
Indore

More Telugu News