Toll Fee: ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు

Toll Fees to be Reduced on Bridges and Tunnels
  • వాహనదారులకు ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం
  • జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనలకు సవరణ
  • సొరంగాలు, వంతెనలు ఉన్న రోడ్లపై తగ్గనున్న టోల్ భారం
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టోల్ రుసుముల లెక్కింపు విధానంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనల వల్ల సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు వంటి నిర్మాణాలు ఉన్న రహదారులపై టోల్ ఛార్జీలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో వాహనదారుల ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి.

వివరాల్లోకి వెళితే, ఇప్పటివరకు 2008 నాటి జాతీయ రహదారుల రుసుము నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, టోల్ ఫీజు లెక్కింపు కోసం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రత్యేకంగా వంతెనలు, సొరంగాలు వంటి నిర్మాణాలు ఉన్న జాతీయ రహదారి విభాగాలకు వర్తిస్తుంది.

ఈ కొత్త గణన పద్ధతి వల్ల కొన్ని మార్గాల్లో టోల్ ఫీజు దాదాపు సగానికి తగ్గుతుందని జాతీయ రహదారుల విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. రెండు వేర్వేరు సమీకరణాల ద్వారా రుసుమును లెక్కించి, అందులో ఏది తక్కువగా ఉంటే దానినే టోల్ ఫీజుగా నిర్ణయిస్తారని ఆయన వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాహనదారులపై ఆర్థిక భారం తగ్గనుంది. 
Toll Fee
National Highways
Toll Tax
India Toll Charges
Highway Toll Reduction
Toll Plaza
Flyovers
Bridges
Tunnels

More Telugu News