Revanth Reddy: రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేటీఆర్‌కు కాదు: మంత్రి సీతక్క

Revanth Reddys challenge is not for KTR says Minister Seethakka
  • రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేసీఆర్‌కు అన్న సీతక్క
  • ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్ చర్చకు రావాలని డిమాండ్
  • బీఆర్ఎస్ చచ్చిపోయిందని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అర్థం కానట్లుందని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేటీఆర్‌కు కాదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అని ఆమె స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ చర్చకు రావాలని సీతక్క డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఇప్పటికే చచ్చిపోయిందని, కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలు కూడా అంగీకరించడం లేదని ఆమె అన్నారు. కేటీఆర్‌ తమ నాయకుడే కాదని కవిత ఒక ఇంటర్వ్యూలో చెప్పారని సీతక్క గుర్తు చేశారు.
Revanth Reddy
KTR
Seethakka
KCR
Telangana Assembly
BRS Party
Telangana Politics
Kavitha

More Telugu News