Hyderabad Rains: భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

Hyderabad Rains Flood Roads Disrupting Life
  • హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం
  • బేగంబజార్, కోఠి, ఖైరతాబాద్ సహా ప్రధాన ప్రాంతాలు జలమయం
  • రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
  • పలు ముఖ్యమైన రహదారులపై నిలిచిపోయిన ట్రాఫిక్‌
  • పనులపై బయటకు వెళ్లిన ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు
భాగ్యనగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్యాలయాలు, ఇతర పనుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నగరంలోని కోఠి, బేగంబజార్, అబిడ్స్, సుల్తాన్ బజార్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ వంటి కీలక ప్రాంతాల్లో రహదారులు నీటితో నిండిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం కారణంగా వాహనదారులు, పాదచారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు.
Hyderabad Rains
Hyderabad
Telangana Rains
Heavy Rainfall Hyderabad
Hyderabad Flooding

More Telugu News