Chandrababu Naidu: తెలుగు ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Greets Telugu People on Toli Ekadashi
  • ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ప్రార్ధిస్తున్నానన్న చంద్రబాబు
  • సమృద్ధిగా వర్షాలు పడి, పాడి పంటలతో రాష్ట్రం శోభిల్లాలని అకాంక్షించిన సీఎం  
ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. తొలి పండుగగా భావించే ఈ తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలతో రాష్ట్రం శోభాయమానంగా విలసిల్లాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. 
Chandrababu Naidu
AP CM
Toli Ekadashi
Ekadashi wishes
Andhra Pradesh
Telugu festival
Hindu festival
Vishnu
Rainfall
Agriculture

More Telugu News