Pashamylaram Fire Accident: పాశమైలారం పేలుడు ఘటన.. 41కి చేరిన మృతుల సంఖ్య

Pashamylaram Fire Accident Death Toll Reaches 41
  • పాశమైలారం సిగాచీ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరొకరు మృతి
  • మృతుల సంఖ్య 41కి చేరినట్లు అధికారుల వెల్లడి
  • ఇప్పటి వరకు లభ్యం కాని 9 మంది ఆచూకీ 
  • కొనసాగుతున్న శిథిలాల తొలగింపు పనులు
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 41కి చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జితేందర్ అనే వ్యక్తి ఆదివారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు, శిథిలాల కింద లభించిన మరో మృతదేహం వివరాలను అధికారులు గుర్తించారు.

ఈ ప్రమాదంలో గల్లంతైన మరో తొమ్మిది మంది ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
Pashamylaram Fire Accident
Sangareddy
Sigachi Industries
Fire Accident
Explosion
Telangana
Industrial Accident
Casualties

More Telugu News