Nara Lokesh: రేపు నెల్లూరులో మంత్రి లోకేశ్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

Nara Lokesh to Visit Nellore Tomorrow Schedule Released
  • ప్రసిద్ధ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు హాజరు
  • వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంభించనున్న లోకేశ్‌ 
  • నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలతో బిజీబిజీగా మంత్రి
రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నెల్లూరు నగరంలో జరిగే ప్రసిద్ధ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొన‌నున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ వేడుకకు హాజరుకానుండటంతో పార్టీ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

అధికారికంగా విడుదలైన పర్యటన వివరాల ప్రకారం, మంత్రి లోకేశ్‌ సోమవారం ఉదయం తన పర్యటనను ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు నెల్లూరు నగరంలోని వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో, ఆ తర్వాత సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య బారాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొని, తన పర్యటనను ముగిస్తారు.
Nara Lokesh
Nellore
Barahshaheed Dargah
Rottela Panduga
AP Minister
VR Municipal High School
Andhra Pradesh
TDP
Nellore City Constituency

More Telugu News