Dhulipalla Narendra: పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ రాజకీయ కుట్ర: ఎమ్మెల్యే ధూళిపాళ్ల

Dhulipalla Narendra Accuses YSRCP of Political Conspiracy in Ponnuru Attack
  • ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయడమే వారి లక్ష్యం
  • దాడి రోజు కాపు కాసిన వైసీపీ వర్గీయులు
  • టీడీపీ నేతలు బాబురావు, అశోక్‌పై దాడికి పన్నాగం
  • పోలీసుల మాట కాదని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు
  • ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు
పొన్నూరులో జరిగిన దాడి ఘటనను వైసీపీ ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై బురద చల్లి, అప్రతిష్ఠ పాలు చేసేందుకే వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని నరేంద్ర అన్నారు. దాడికి గురైన నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు, ఆ ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు కాపు కాశారని ఆయన ఆరోపించారు. నిజానికి టీడీపీ నేతలు బండ్లమూడి బాబురావు, అశోక్‌లపై దాడి చేయడమే వారి అసలు ప్రణాళిక అని, ఈ మేరకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారని తెలిపారు.

దాడి జరిగిన తర్వాత గాయపడిన వ్యక్తిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీసులు ప్రయత్నించారని, అయితే వైసీపీ నేతలు కావాలనే అడ్డుపడి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని ధూళిపాళ్ల వివరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.

Dhulipalla Narendra
Ponnuru
YSRCP
Andhra Pradesh Politics
Political Conspiracy
Attack Incident
Bandlamudi Baburao
Ashok
Guntur Government Hospital
Telugu Desam Party

More Telugu News