'చట్నీ సాంబార్' ( హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

Chutney Sambar

Movie Name: Chutney Sambar

Release Date: 2024-07-26
Cast: Yogi Babu, Vani Bhojan, Chandran, Nithin Sathya, Nizhalgal Ravi , Deepa Shankar
Director:Radha Mohan
Producer: Ishari K Ganesh
Music: Ajesh
Banner: Vels Film International
Rating: 2.50 out of 5
  • యోగిబాబు ప్రధాన పాత్రగా చట్నీ సాంబార్'
  • 6 ఎపిసోడ్స్ గా రూపొందిన కామెడీ డ్రామా
  • కామెడీపై జరగని కసరత్తు
  • బోరింగ్ గా సాగే సిరీస్
  • ఊరట కలిగించే ఊటీ లొకేషన్స్


కోలీవుడ్ లో హాస్యనటుడిగా యోగిబాబు ఇప్పుడు ఫుల్ బిజీ. ఒక వైపున వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న ఆయన. వెబ్ సిరీస్ ల పై కూడా దృష్టి పెట్టాడు. ఆయన ప్రధానమైన పాత్రగా 'చట్నీ సాంబార్' వెబ్ సిరీస్ రూపొందింది. రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, ఈ నెల 26వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఊటీలో రత్నస్వామి (నిళల్ గల్ రవి) 'అముద' పేరుతో ఒక హోటల్ నడుముతూ ఉంటాడు. అక్కడ 'సాంబార్' చాలా రుచిగా ఉంటుందని అంతా చెప్పుకుంటూ ఉంటారు. భార్య జయలక్ష్మి (మీరా కృష్ణన్) కొడుకు కార్తిక్ (చంద్రన్) కూతురు అముద (మైన నందిని) ఆమె భర్త .. ఇదే అతని కుటుంబం. ఇక ఆ ఇంట్లో వంట మనిషిగా ఉన్న సోఫీ ( వాణి భోజన్) ను కూడా వాళ్లు తమ కుటుంబ సభ్యురాలిగానే చూస్తూ ఉంటారు.

కార్తిక్ అదే ఊళ్లోని జెన్సీ (సంయుక్త)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె తండ్రి .. కార్తిక్ తండ్రి రత్నస్వామి మంచి స్నేహితులు. అయినా తన కూతురును కార్తిక్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి అతను అంగీకరించడు. ఇక సోఫీ భర్త ఒక హత్య కేసు విషయంలో జైలుకి వెళతాడు. అందువలన అతని నుంచి ఆమె దూరంగా ఉంటూ ఉంటుంది. ఆమెను తిరిగి రప్పించే ప్రయత్నంలో అత్తగారు గౌరీ ఉంటుంది. 

సోఫీ తండ్రి తాగుబోతు కావడం వలన, అతనిని అడ్డుపెట్టుకుని తాను అనుకున్నది సాధించాలని గౌరీ భావిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే రత్నస్వామి కేన్సర్ బారిన పడతాడు. తాను ఎక్కువ కాలం బ్రతకనని తెలుసుకున్న అతను, తన కొడుకు కార్తిక్ ను మాత్రమే రూమ్ కి పిలుస్తాడు. గతంలో తాను చెన్నై లో ఉన్నప్పుడు, తనకి 'అముద' అనే యువతితో అనుబంధం ఏర్పడిందని చెబుతాడు. అముద కొంతకాలం క్రితం చనిపోయిందని చెబుతూ, ఆమె ఫొటో చూపిస్తాడు.

అముదకి తన వలన ఒక కొడుకు ఉన్నాడనీ, అతని ఆచూకీ తెలుసుకుని తీసుకురమ్మని కోరతాడు. అతనే తనకి తలకొరివి పెట్టాలనీ, అతనిని తమ కుటుంబ సభ్యుడిగానే చూడాలని అంటాడు. అందుకు అంగీకరించిన కార్తీక్ చెన్నై వెళ్లి, అముద ఫొటో ద్వారా ఆమె కొడుకు సచిన్ (యోగిబాబు)ను కలుసుకుంటాడు. అక్కడ అతని ఇడ్లీ బండి ఫేమస్ .. అతను చేసే చట్నీకి మంచి గిరాకీ. కార్తీక్ ద్వారా జరిగింది తెలుసుకున్న సచిన్ ముందుగా అసహనానికి లోనైనా, ఆ తరువాత అంగీకరిస్తాడు. అతణ్ణి చూస్తూనే రత్నస్వామి ప్రాణాలు వదులుతాడు. 

రత్నస్వామి అంత్యక్రియలు సచిన్ చేతుల మీదుగా జరగడం, జయలక్ష్మికీ ..ఆమె కూతురు అముదకి అనుమానాన్ని కలిగిస్తుంది. దాంతో వాళ్లకి అసలు విషయం చెబుతాడు కార్తీక్. అప్పుడు వాళ్లు ఎలా స్పందిస్తారు? సచిన్ కి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? కార్తీక్ కి జెన్సీ ను ఇచ్చి పెళ్లి చేయకపోవడానికి కారణం ఏమిటి? తన జీవితానికి సంబంధించిన విషయంలో సోఫీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది మిగతా కథ.           

 యోగిబాబు కామెడీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు. అందువలన ఈ వెబ్ సిరీస్ నాన్ స్టాప్ కామెడీతో నడుస్తుందని అంతా భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సిరీస్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతూ వెళుతుంది. దర్శకుడు రాధామోహన్ ఎంచుకున్న లైన్ మంచిదే. అన్ని వైపుల నుంచి కావాల్సినంత కామెడీని పిండుకోవడానికి అవకాశం ఉన్న కథనే. కానీ ఆ లైన్ లో వినోదభరితమైన సన్నివేశాలను .. ఆసక్తికరమైన మలుపులను కూర్చడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 

ఈ కథ అంతా ఊటీలో సాగుతుంది. ఆహ్లాదకరమైన లొకేషన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఆర్టిస్టుల ఎంపిక కూడా బాగానే ఉంది. కానీ ఆ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. అసలైన కథను కరెక్టుగా అల్లుకోకపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. అనవసరమైనవిగా అనిపిస్తూ, పొడిపొడిగా కనిపించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. తన పాత్రకి యోగిబాబు జీవం పోసినా, అతని స్థాయికి తగిన కామెడీ లేని కంటెంట్ గానే ఈ  సిరీస్ కనిపిస్తుంది. 

 ఊటీ లొకేషన్స్ ను తెరపై అందంగా ఆవిష్కరించడంలో ప్రసన్న కుమార్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. అజేశ్ నేపథ్య సంగీతం కథకు కొంతవరకూ సపోర్ట్ చేసింది. జిజేన్ద్రన్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ఛార్లీ .. కుమార్ వేల్ కి సంబంధించిన ఒకటి రెండు సీన్స్, సచిన్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లే సీన్ అవసరం లేనివిగా అనిపిస్తాయి. ఈ కథ ఆరంభంలో మాత్రమే 'చట్నీ సాంబార్' ప్రస్తావన కనిపిస్తుంది. ఆ తరువాత ఆ అంశాన్నే పక్కన పెట్టేసి, చివర్లో ఒకసారి గుర్తుచేస్తారు. ఈ మధ్యలో జరిగే కథలో వినోదాన్ని పంచేది తక్కువ .. విసిగించేది ఎక్కువ. 


Trailer

More Reviews