'వర్షంగళ్కు శేషం'- (సోనీ లివ్) మూవీ రివ్యూ!
Movie Name: Varshamgalkku Sesham
Release Date: 2024-06-07
Cast: Pranav Mohanlal, Dhyan Sreenivasan,Nivin Pauly ,Kalyani Priyadarshan,Vineeth Sreenivasan
Director: Vineeth Sreenivasan
Producer: Visakh Subramaniam
Music: Amrit Ramnath
Banner: Merryland Cinemas
Rating: 2.75 out of 5
- ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా 'వర్షంగళ్కు శేషం'
- 1970 - 90 మధ్య కాలంలో నడిచే సినిమా
- సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరిగే కథ
- సహజత్వానికి దగ్గరగా వెళ్లే పాత్రలు
- ఎమోషన్స్ కి పెద్దపీట వేసిన కంటెంట్
మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ - ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'వర్షంగళ్కు శేషం'మలయాళ సినిమా, ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా, చాలా వేగంగా 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 7వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ లోను స్ట్రీమింగ్ అవుతోంది. అలాంటి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1970- 90 మధ్య కాలంలో జరుగుతూ ఉంటుంది. కేరళలోని ఒక ఊళ్లో ఈ కథ మొదలవుతుంది. వేణు ( ధ్యాన్ శ్రీనివాసన్) చిన్నప్పటి నుంచి నాటకాలు .. సినిమాలు అంటే ఇష్టం. అందువలన ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలనేది అతని కోరిక. అదే సమయంలో అతనికి మురళి (ప్రణవ్ మోహన్ లాల్) తారసపడతాడు. అతనికి సంగీతం అంటే ప్రాణం. వయోలిన్ ప్లే చేయడంలో అతనికి మంచి ప్రావీణ్యం ఉంటుంది.
వేణు - మురళి ఇద్దరి ఆశ.. ఆశయం ఒకటే. సినిమాలకి సంబంధించి తామేమిటనేది నిరూపించుకోవాలి. అందుకోసం ఇద్దరూ కలిసి మద్రాసు వెళతారు. అక్కడ తమకు తోచిన పనులను చేస్తూ తమ ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరికివారు తన కంటే ముందుగా తన స్నేహతుడికి ఛాన్స్ రావాలని భావిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వేణుకి దర్శకత్వం వహించే ఛాన్స్ వస్తుంది.
కేశవ్ దేవ్ అనే నిర్మాత ఒక సినిమా తీసి బాగా నష్టపోతాడు. ఆ సినిమా పోతుందని ముందుగానే మురళి చెప్పడం ఆయనకి గుర్తొస్తుంది. వెంటనే ఆయన మురళిని కలిసి .. తరువాత సినిమా సంగతి ఆలోచన చేయమని చెబుతాడు. ఆ సినిమా ఛాన్స్ వేణుకి దక్కేలా చేస్తాడు మురళి. ఇక అక్కడి నుంచి దర్శకుడిగా అతను దూసుకుపోతుంటాడు. తన మిత్రుడు పైకొస్తే చాలానే ఉద్దేశంతో మురళి ఉంటాడు.
మొదటి నుంచి వారి ఎదుగుదలను చూస్తూ వస్తున్న వారంతా, స్నేహమంటే అలా ఉండాలని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ల మధ్య గొడవ జరుగుతుంది. అందుకు కారణం ఏమిటి? ఆ సంఘటన తరువాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? చివరికి ఏమౌతుంది? అనేవి కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కలిసి తిరిగేవారు చాలామందే ఉంటారు. 1970- 90 మధ్య కాలంలో స్నేహాలు .. పరిచయాల ద్వారానే ఎక్కువ అవకాశాలు లభించేవి. అప్పట్లో తమకి తెలిసిన ఛాన్స్ ఏదైనా ఉంటే, అది తమకి స్నేహితులకు ఇప్పించడానికి ఆరాటపడే ఒక స్వభావం ఉండేది. అందువలన ఒకరికి ఒకరు అవకాశాలు ఇప్పించుకుంటూ ముందుకు వెళ్లడమనే ఆనాటి వాతావరణం, ఈ కథలో కనిపిస్తుంది.
ఈ కథలో లవ్ .. రొమాన్స్ .. కామెడీకి చోటు లేదు. స్నేహం .. దాని కోసం చేసే త్యాగం .. ఎమోషన్స్ కనిపిస్తాయి. ప్రధానమైన పాత్రలను చేసిన వాళ్లంతా సహజత్వానికి చాలా దగ్గరగా ఆ పాత్రలను తీసుకెళ్లారు. అమృత్ రామ్ నాథ్ సంగీతం ఆ కాలంలోకి తీసుకుని వెళుతుంది. విశ్వజిత్ ఫొటోగ్రఫీ .. రంజిత్ ఎడిటింగ్ కథను సపోర్టు చేస్తూ వెళ్లాయి.
ఒకనాటి చిత్రపరిశ్రమలోని పరిస్థితులు .. అక్కడి వాతావరణం .. ఆనాటి స్నేహాలు .. ప్రేమలు గురించిన అంశాలను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకెళ్లే ఈ సినిమా, ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది. కళాకారులు ప్రేక్షకుల చప్పట్లను మాత్రమే కోరుకుంటారు. ఆ చప్పట్లు మాత్రమే వారి ఆకలిదప్పులు తీరుస్తాయనే విషయాన్ని మరోసారి చాటి చెబుతూ సాగిపోయే సినిమా ఇది.

Peddinti