ఆంధ్రుల గర్వం అంబేద్కర్ స్మృతివనం

Related image

ఆంధ్రులు గర్వించే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని జన భాగిధారీ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయిన భాగ్యలక్ష్మి అన్నారు.

 విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మరియు 141 సచివాలయం లోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం, జనవరి 19న  ప్రారంభోత్సవం సందర్భంగా జన్ బాగిదారి కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పటానికి పూల మాలలు అర్పించి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియపరచి. మొదటి పౌరురాలుగా తన సంతకాన్ని చేసి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సూచించిన మార్గదర్శకాలు నడవాలని, ప్రజలకు తెలియపరచటమే కాకుండా అందుకు ప్రతినిత్యం సిద్ధం అని తెలిపే తన సంతకాన్ని జతపరిచారు.

అనతరం 46 వ డివిజన్, తమ్మిన కృష్ణ వీధి లో ప్రజలకు అవగాహనా కల్పించేందుకు రాలి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎవరైనా సరే తలెత్తుకొని చూసేలా 125 అడుగుల  ఎత్తైన కాంస్య విగ్రహం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఘన నివాళి అని పేర్కొన్నారు. ఇలాగే ప్రతి సచివాలయంలో నిర్వహించే జన్భాగ్యర్ధారి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జనరల్ కె. శకుంతల, మేనేజర్ బి శ్రీనివాస్, డిసిపీ భాస్కర్, కార్పొరేషన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


 

More Press Releases