రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమైన కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు....
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో నేడు సమావేశమైన కేరళ ప్రభుత్వ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ కె.రాజన్.... తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం గడిచిన పది ఏళ్లలో రెవెన్యూ శాఖను, యంత్రాగాన్ని, వ్యవస్థను, దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ ప్రభుత్వం తగు చర్యలకు ఉపక్రమించిందని, ఆ దిశలో పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
డా॥బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం కేరళ ప్రభుత్వ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి శ్రీ కె.రాజన్, ఆ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ కార్యదర్శి సాంబశివరావ్, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ కూడా పాల్గొన్నారు. కేరళ రాష్ట్రంలో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్‌తో పాటూ రెవెన్యూ విభాగం పనితీరు, వాటి వివరాలను మంత్రి పొంగులేటి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైనదని, అదే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని ఈ విభాగం సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ప్రజలకు ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు, అకాంక్షలు నేరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.