ప్రజల సమస్యలకు పరిష్కారం స్పందన: ప్రజలు నుండి అధికారులు దరఖాస్తు స్వీకరించారు
విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లోవిజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 19 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ పరిధిలోని సమస్యలను అర్జీ రూపంలో కార్పొరేషన్ అధికారులకు సమర్పించగా సంబంధిత అధికారులు ఆ సమస్యకు సత్వర పరిష్కారం అందిస్తామని అన్నారు.
సోమవారం ఉదయం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ విభాగానికి 2, టౌన్ ప్లానింగ్ 11, ప్రజా ఆరోగ్యం-1, రెవిన్యూ -2, పిఒయుసిడి 1, ఎస్టేట్ 2, మొత్తం కలిపి 19 అర్జీలు, ప్రజలు నుండి అధికారులు దరఖాస్తు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె. సత్యవతి, చీఫ్ సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) సృజన , జాయింట్ డైరెక్టర్ అమృత్ లతా, అకౌంట్స్ ఆఫీసర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.