మహేష్ బాబు ఫౌండేషన్ మరియు ఔట్‌రీచ్ క్లబ్ కలిసి "గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా" సుమారు 300 మంది రన్ లో పాల్గొన్నారు

Related image

ఔట్‌రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్శిటీ, మహేష్ బాబు ఫౌండేషన్ (MB ఫౌండేషన్) భాగస్వామ్యంతో  "Heartathon: A Run to Support Children Batling with congenital Heart Disease," అనే కార్యక్రమాన్ని పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన మరియు నిధులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం మార్చి 16వ తేదీన KBR పార్క్‌లో జరిగింది, ఇందులో సుమారు 300 మంది వ్యక్తులు 3 కి.మీ నుంచి 5 కి.మీ మార్గంలో పరుగెత్తారు. 
మహేశ్ బాబు ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు నమ్రతా శిరోద్కర్ ఈ వేడుకను పురస్కరించుకుని అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా విజేతలను వ్యక్తిగతంగా సత్కరించారు. దీనిలో అంకితభావంతో పాల్గొన్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
 
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడానికి వారి నిబద్ధతను ప్రదర్శిస్తూ, మహేష్ బాబు ఫౌండేషన్ మరియు ఔట్‌రీచ్ క్లబ్‌ల మధ్య సహకార స్ఫూర్తిని హార్ట్‌థాన్ చెప్పుకొస్తుంది.

More Press Releases