ఇప్పటివరకు రూ.47,18,300/- నగదు సీజ్: .జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
*నగరంలో ఎన్ఫోర్స్ మెంట్ బృందాల విస్తృత తనిఖీలు* *హైదరాబాద్, మార్చి 20:* ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటైన ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఇప్పటివరకు రూ.47,18,300/- నగదును, రూ.17,49,140/- ల విలువైన ఇతర వస్తువులు, 104.41 లీటర్ల అక్రమ మద్యం ను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీల సందర్భంగా రూ.29,70,000/- నగదుతో పాటు రూ.23,829/- ల విలువగల ఇతర వస్తువులు, 49.74 లీటర్ల అక్రమ లిక్కర్ ను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటి వరకు రూ. 38 లక్షలు సీజ్ చేయగా, పోలీస్ బృందం రూ. 9,18,300/- ల నగదు తో పాటు రూ.17,49,140/- విలువ గల ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. 15 మంది పై ప్రోహిబిషన్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగదు, ఇతర వస్తువుల పై 26 ఫిర్యాదులు రాగా పరిశీలించి పరిష్కరించారని, 19 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.