భారత్ లో తయారైన ఎస్ యూవీ ఎలివేట్‌ని జపాన్‌లో WR-Vగా విడుదల చేసిన హోండా

Related image

కంపెనీ ప్రపంచ వ్యాపార వ్యూహంలో కీలక ఎగుమతి కేంద్రంగా మారడానికి

హోండా భారతీయ కార్యకలాపాలకు మార్గదర్శక మైలురాయి

 
న్యూదిల్లీ, మార్చి 22, 2024: భారత్ లో తయారయ్యే హోండా ఎలివేట్ జపనీస్ మార్కెట్‌లో WR-వి బ్రాండ్ పేరు తో విడుదల కావడంతో భారతదేశంలో ప్రీమియం కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL)   ఈరోజు చారిత్రాత్మక మైలురాయిని వేడుక చేసుకుంది.

 హెచ్ సిఐఎల్ వ్యాపారంలో మొట్టమొదటిసారిగా భారతదేశం నుండి జపాన్‌కు ఒక మోడల్ ఎగుమతి చేయ బడుతోంది. ఇది భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమ  గణనీయమైన పురోగతిని మాత్రమే కాకుండా దేశం యొక్క పెరుగు తున్న ఉత్పాదక నైపుణ్యం మరియు ప్రపంచ పోటీతత్వాన్ని చాటిచెబుతోంది.

భారతదేశం నుండి జపాన్‌కు ఎలివేట్‌ను ఎగుమతి చేయాలనే హోండా నిర్ణయం సంస్థ భారతీయ కార్యకలాపా ల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు అధిక నాణ్యత గల ఉత్పత్తులను అందించడంలో కంపెనీ విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది.

ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ టకుయా సుమురా మాట్లా డుతూ, ‘‘మేడ్-ఇన్-ఇండియా’’ ఎలివేట్‌ను జపాన్‌లో డబ్ల్యూఆర్-విగా ప్రారంభించడం మనందరికీ గర్వకారణం. ఇది హోండా ప్రపంచ వ్యాపార వ్యూహాలలో హోండా కార్స్ ఇండియా యొక్క మా తయారీ సామర్థ్యాన్ని,   పెరుగుతున్న ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. సరికొత్త హోండా ఎలివేట్ భారతీయ మార్కెట్‌లో మా వ్యాపా రానికి కీలక స్తంభంగా మారింది. మేం ఈ విజయాన్ని పునరావృతం చేయగలమని, అత్యుత్తమ నాణ్యత, నైపుణ్యంతో మా ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులను సంతృప్తి పరచగలమని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

 
ఎలివేట్ గత సంవత్సరం సెప్టెంబరులో మోడల్‌ను ఈ లాంచ్ చేసిన మొదటి మార్కెట్‌గా భారతదేశంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశించింది మరియు గత 6 నెలల్లో 30,000 యూనిట్లకు పైగా విక్రయించబడింది.

ఈ మోడల్ జపాన్‌లో డిసెంబర్ 23లో హోండా WR-Vగా ఆవిష్కరించబడింది. బలమైన రహదారి ఉనికి, అత్యుత్తమ స్పేస్ & సౌలభ్యం, అధునాతన భద్రతా ఉత్పాదన మరియు చక్కటి ఫీచర్లతో తన బోల్డ్ ఎస్ యూవీ డిజైన్‌ను ఇష్టపడే కస్టమర్‌ల నుండి అద్భుతమైన  స్పందనను అందుకుంది.

 టర్కీ, మెక్సికో, పశ్చిమాసియా లోని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్‌లకు మరియు  నేపాల్, భూటాన్, దక్షిణాఫ్రికా మరియు ఎస్ఏడీసీ దేశాలలో రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్‌లకు తన శ్రేణిలోని మోడల్‌లను హెచ్ సిఐఎల్ ఎగుమతి చేస్తోంది. జపాన్‌కు హోండా ఎలివేట్ ఎగుమతి భారతదేశం నుండి ఎగుమతి వ్యాపారానికి సరికొత్త జోడింపు.

More Press Releases