కొత్త కెప్టెన్‌ను తమ బోర్డ్ పైకి తీసుకువచ్చిన క్లియర్‌ట్రిప్ ; తమ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని ని ఎంచుకుంది
ఈ భాగస్వామ్యం లో భాగంగా, క్లియర్‌ట్రిప్ మరియు మహేంద్ర సింగ్ ధోనీ క్లియర్‌చాయిస్ కోసం విజ్ఞప్తి చేశారు.
బెంగళూరు, 30 మార్చి 2024: ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అయిన క్లియర్‌ట్రిప్ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనిని ఎంచుకుంది. ఈ భాగస్వామ్యం క్లియర్‌ట్రిప్‌కి ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఇది మహేంద్ర సింగ్ ధోనితో జతకట్టడం ఒకటి అయితే , ప్రయాణంలో సరైన ఎంపికలు చేసుకోవాలని మహేంద్ర సింగ్ ధోని సూచించడం మరోటి. "క్లియర్‌చాయిస్" ప్రచారం కింద, నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేయడానికి , సౌకర్యవంతమైన మరియు ఆందోళన-రహిత ప్రయాణ అనుభవాలను అందించడానికి ప్రయాణికులను ప్రేరేపించడం బ్రాండ్ లక్ష్యం.
కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోని, పారదర్శకత, ఆశావాదం మరియు నిక్కచ్చితత్వం యొక్క విలువలకు ప్రతిరూపంగా నిలుస్తారు. అదే అతన్ని క్లియర్‌ట్రిప్ యొక్క విలువలకు పరిపూర్ణ స్వరూపుడుగా చేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా, క్లియర్‌ట్రిప్ తరాలు మరియు భౌగోళికాలను అధిగమించిన మహేంద్ర సింగ్ ధోని యొక్క విశ్వవ్యాప్త అభిమానంపై ఆధారపడి, విభిన్న వినియోగదారుల కోసం విశ్వసనీయ ప్రయాణ భాగస్వామిగా తమ స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, దాని కస్టమర్ బేస్‌ను వేగంగా విస్తరించడానికి మరియు దాని మార్కెట్ ఉనికిని పెంచడానికి క్లియర్‌ట్రిప్ యొక్క దృష్టికి అనుగుణంగా ఉంది.
క్లియర్‌ట్రిప్ బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ, “నా కెరీర్ మొత్తంలో, ఖండాలు దాటి ప్రయాణించాను. నేను నిజమైన గ్లోబ్‌ట్రాటర్‌గా ఉన్నాను . ప్రయాణం పట్ల నాకున్న ప్రేమను కనుగొన్నాను. చాలా సంవత్సరాల తర్వాత, నేను ఆసక్తిగా ఎదురుచూసే విషయంగా ప్రయాణం మారింది. ఆహ్లాదకరమైన, చిరస్మరణీయమైన మరియు అర్థవంతమైన ప్రయాణం ఎలా ఉండాలో ప్రతిబింబించే బ్రాండ్ అయిన క్లియర్‌ట్రిప్ బోర్డు లోకి వచ్చినందుకు నేను మరింత సంతోషంగా వున్నాను. నా కెరీర్‌లో, నేను ప్రతిరోజూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాను, కానీ క్లియర్‌ట్రిప్‌తో, నిర్ణయం తీసుకోవడం సులభం , సూటిగా ఉంటుంది. పారదర్శకత పట్ల వారి నిబద్ధత ఎంపికలను సులభతరం చేస్తుంది . ఎవరైనా తమ కలల ప్రయాణంలో నమ్మకంగా వెళ్లేలా చేస్తుంది..." అని అన్నారు.
ఈ భాగస్వామ్యం పై క్లియర్‌ట్రిప్ సిఇఒ, అయ్యప్పన్ ఆర్ మాట్లాడుతూ, “మహేంద్ర సింగ్ ధోనిని క్లియర్‌ట్రిప్ కుటుంబానికి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అతను గౌరవనీయమైన క్రీడాకారుడు మాత్రమే కాదు ఆయన మొత్తం తరానికి స్ఫూర్తినిచ్చారు. విలువలకు ప్రసిద్ది చెందిన ధోనీ, తరచుగా నమ్మకం , గొప్ప నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంతో సంబంధం కలిగి వున్నారు. అతనితో మా భాగస్వామ్యం ద్వారా, ప్రయాణంలో సజావుగా సరైన ఎంపికలు చేసుకునేందుకు వ్యక్తులను శక్తివంతం చేయాలని మేము ఆశిస్తున్నాము. మేము వేగంగా ఎదుగుతూనే ఉన్నందున, వారు ఎక్కడి నుండి వచ్చినా, ప్రతి ఒక్కరికీ ప్రయాణాన్ని సాధించగల ఆకాంక్షగా మార్చాలని మేము ఆశిస్తున్నాము. మహేంద్ర సింగ్ ధోనీ మాతో ఉండటంతో, పెద్ద సంఖ్యలో ప్రజలను, ఆత్మవిశ్వాసంతో బయటికి వెళ్లి ప్రపంచాన్ని అన్వేషించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకున్నాము" అని అన్నారు
మహేంద్ర సింగ్ ధోనీ తన తొలి ఇన్నింగ్స్‌ను క్లియర్‌ట్రిప్‌తో ఎంటర్టైనింగ్ యాడ్ ఫిల్మ్‌తో గుర్తించనున్నారు, అది త్వరలో ప్రసారం కానుంది.
క్లియర్‌ట్రిప్ మరియు మహేంద్ర సింగ్ ధోనీ కలిసి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులను క్లియర్‌చాయిస్ ను విశ్వసించేలా మరియు స్పష్టత, విశ్వాసం , మరపురాని అనుభవాలతో కూడిన ప్రయాణాలను ప్రారంభించేలా ప్రేరేపించాలని ఆకాంక్షిస్తున్నారు. క్లియర్‌ట్రిప్ బోర్డు లోకి రండి, కెప్టెన్ నాయకత్వాన్ని అనుసరించండి మరియు సరైన ఎంపిక చేసుకోండి.!