వర్షపు నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలి - ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్

Related image

హైదరాబాద్, ఏప్రిల్ 6 : వర్షపు నీరు వృదా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సన్నద్దం కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులకు తెలియజేశారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ర్ట సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వర్షపు నీరు ఉపయోగించుకుంటే వరద ముంపు, నీటి ఎద్దడి వంటి ప్రధాన సమస్యలను అదిగమించవచ్చని ఆమె పేర్కొన్నారు. పర్యావరణ, భూ ఉపరితల ఉస్ణోగ్రతల పరిరక్షణ, నీటి సంరక్షణ, విధ్యుత్ పొదుపు వంటి ప్రధాన అంశాల పై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముఖ్య కార్యదర్శి చర్చించారు. ఈ సమావేశంలో వర్షపు నీటి నిల్వ, వినియోగించుకునే విధానం, టెర్రస్ గార్డెనింగ్ ద్వారా వాతావరణంలో ఉస్ణోగ్రతలను తగ్గించుకోవడం, టెర్రస్ ల పై సోలార్ ప్లాంట్ లు ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో ఆమె సమీక్షించారు.

రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలలో భవణాల నిర్మాణాలు పెరిగిపోవడం వలన ప్రతి యేట వర్షాకాలంలో కొన్ని కోట్ల లీటర్ల నీరు వృదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఒక వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనంలో సుమారు లక్ష లీటర్ల నీరు వృధా అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఇంటి యజమానులు వారి ఇళ్ల రూఫ్ టాప్ ల పై వర్షపు నీటిని వడిసిపట్టి వాటిని నిలువ చేసుకోవడం ద్వారా నిత్యావసర వినియోగానికి, మెక్కల పెంపకానికి ఆ నీరు ఉపయోగపడుతుందని పర్యావరణ నిపుణులు ఈ సమావేశంలో అబిప్రాయపడ్డారు.

ముందుగా రాష్ట్ర సచివాలయ భవన ప్రాంగణంలో వర్షపు నీరు నిలువ చేసి, వాటిని వినియోగించుకోనే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచన మేరకు సమావేశంలో నిర్ణయించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ సమూదాయాలలో, వర్షపు నీరు నిలువ కోసం స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాట్లు, సోలార్ ప్లాంట్ లు ఏర్పాట్లు చేసి, సాధారణ ప్రజానీకానికి కూడా అదర్శంగా నిలువలని అధికారులకు సూచించారు. రానున్న వర్ష కాలం సీజన్ కు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని ఆమె అధికారులకు సూచించారు. ఏప్రిల్ మాసంలో 1000 మంది ప్లంబర్లకు, వినియోగదారులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్లంబర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా కాలనీ సంక్షేమ సంఘాలకు, ప్రజలకు వర్షపు నీరు వినియోగం, నిర్వహణ పై అవగాహన పెరుగుతుందని సమావేశంలో అధికారులు అభిప్రాయ పడ్డారు. జి.హెచ్.యం.సి ఇతర మున్సిపల్ పట్టణాలల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలని ఆమె ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ వలన 390 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్రంలో ప్రజలందరు తమ తమ ఇండ్లలో ఇంకుడు గుంతలు, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, రూఫ్ గార్డెనింగ్ లు ఏర్పాటు చేసుకోవాలని అ విధంగా అధికారులకు కూడా అవగహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు, కాలానీ సంక్షేమ సంఘాలు, ప్రజలందరు ఏకమై వర్షపు నీరు వినియోగానికి భాగాస్వాయ్యం చేయాలని ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు. విద్యుత్ ఆదా మరియు సోలార్ పరికరముల వినియోగం పై కూడా ప్రజలకు అవగాహన పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు నిర్ణయించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 300 చ.అ. విస్తీర్ణం కలిగిన 38,000 భవనాలు ఉన్నాయని, అందులో 11,000 భవనాలు తనిఖీ చేయగా, 7,883 భవనాలు మాత్రమే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాయని జి.హెచ్.యం.సి కమీషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. నీటి వృదాను అరికట్టవలసినదిగా MD సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జి.హెచ్.యం.సి కమీషనర్ రోనాల్డ్ రోస్ , ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ , మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య , హైదరాబాద్ వాటర్ వర్క్స యం.డి. సుదర్శన్ రెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, వర్షపు నీటి ప్రాజెక్టు డైరెక్టర్‌ కల్పనా రమేష్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.

     

More Press Releases