జూన్ 01, 2024 నుండి ధరల సవరణను ప్రకటించిన ఆడి ఇండియా

Related image

మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధర 2% వరకు పెరుగుతుంది ఇన్‌పుట్‌ వ్యయాల పెరుగుదల కారణంగా ధరల పెంపు ముంబై, ఏప్రిల్ 25, 2024: పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలు, రవాణా ఖర్చుల కారణంగా తన మోడల్ శ్రేణిలో 2% వరకు ధరలను పెంచుతున్నట్లు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ప్రకటించింది. ధరల పెంపు జూన్ 01, 2024 నుండి అమలులోకి వస్తుంది. 


ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, “పెరుగుతున్న ఇన్‌పుట్‌ ఖర్చులు జూన్ 01, 2024 నుండి ధరలను 2% వరకు పెంచడానికి మమ్మల్ని వత్తిడి చేస్తున్నాయి. ధరల సవరణ ఆడి ఇండియా, మా డీలర్ భాగస్వాములకు సుస్థిర వృద్ధిని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పెరుగుతున్న ఖర్చుల ప్రభావం ఎప్పటిలాగే మా కస్టమర్‌లకు వీలైనంత తక్కువగా ఉండాలని మేం కోరుకుంటున్నాం; అని అన్నారు. 

ఆడి ఇండియా FY23/24లో 7,027 యూనిట్లను రిటైల్ చేసింది, మొత్తంగా 33% వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ప్రీ-ఓన్డ్ కార్ వ్యాపారం ఆడి అప్రూవ్డ్: ప్లస్ FY23/24లో కూడా 50% వద్ద వృద్ధి చెందింది. ఆడి ఇండియా ఉత్పత్తి పోర్ట్‌ ఫోలియో: ఆడి ఎ4, ఆడి ఎ6, ఆడి ఎ8 ఎల్, ఆడి క్యూ3, ఆడి క్యూ3 స్పోర్ట్‌ బ్యాక్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి క్యూ8, ఆడి ఎస్5 స్పోర్ట్‌ బ్యాక్, ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌ బ్యాక్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆడి క్యూ8 50 ఇ-ట్రాన్, ఆడి క్యూ8 55 ఇ-ట్రాన్, ఆడి క్యూ8 స్పోర్ట్‌ బ్యాక్ 50 ఇ-ట్రాన్, ఆడి క్యూ8 స్పోర్ట్‌ బ్యాక్ 55 ఇ-ట్రాన్, ఆడి ఇ-ట్రాన్ జిటి మరియు ఆడి RS ఇ- ట్రాన్ GT ప్రీమియం, లగ్జరీ విభాగంలో ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్ల అత్యంత విజయవంతమైన తయారీదారులలో ఆడి గ్రూప్ ఒకటి. ఆడి, బెంట్లీ, లంబోర్ఘిని, డుకాటి బ్రాండ్‌లు 12 దేశాల్లో 21 స్థానాల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ఆడి, సంస్థ భాగస్వాములు ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ మార్కెట్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.


2023లో, ఆడి గ్రూప్ 1.9 మిలియన్ ఆడి వాహనాలు, 13,560 బెంట్లీ వాహనాలు, 10,112 లంబోర్ఘిని వాహనాలు, 58,224 డుకాటి మోటార్‌సైకిళ్లను వినియోగదారులకు పంపిణీ చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో, ఆడి గ్రూప్ €69.9 బిలియన్ల మొత్తం రాబడిని మరియు €6.3 బిలియన్ల నిర్వహణ లాభాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా, 2023లో ఆడి గ్రూప్‌లో వార్షిక సగటు 87,000 కంటే ఎక్కువ మంది పనిచేశారు, వారిలో 53,000 మందికి పైగా జర్మనీలోని ఆడి ఏజీలో పనిచేశారు. తన ఆకర్షణీయమైన బ్రాండ్‌లు, అనేక కొత్త మోడల్‌లతో, సమూహం సుస్థిరమైన, పూర్తి నెట్‌వర్క్డ్ ప్రీమియం మొబిలిటీ ప్రొవైడర్‌గా మారడానికి క్రమపద్ధతిలో తనమార్గాన్ని అనుసరిస్తోంది.

More Press Releases