మేడారం జాతర సందర్భంగా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్!
- జాతరలో రానున్న మూడు రోజులు కీలకం
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు
విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు
అధికారులు సమన్వయం తో పని చేయాలి
సేవ చేసే గొప్ప అవకాశం ను సద్వినియోగం చేసుకోండి
జాతరలో పారిశుధ్య కార్మికుల పాత్ర వేల లేనిది
జాతర చివరి రోజున వారికి ప్రత్యేక దర్శనం
సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నోడల్ అధికారి వీపి గౌతమ్, ఓఎస్డి కృష్ణ ఆదిత్య
వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అవసరమైతే మరిన్ని ట్రాక్టర్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విదంగా తల్లులు గద్దెల మీద ఉన్నా 5,6,7,8 వ తేదీలలో ప్రాంగణంలో బెల్లం ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ శుభ్రంగా ఉంచాలని డిపిఓ, ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య కార్మికుల సేవ మహోన్నతమైనదని వారికి చివరి రోజున ప్రత్యేక దర్శనం కలిపిస్తామని కలెక్టర్ ప్రకటించారు. వారికి భోజనాలు , వసతి, చెల్లింపులు సక్రమంగా ఉండేలని ఆయన చెప్పారు.
ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేప్పట్టిన పూర్తి అయిన ఐదు షెడ్లని గిరిజన శాఖకు అప్పగించాలని వాటిలో ఒకటి ఎన్ ఎస్ ఎస్ వాలింటీర్లకు అదేవిదంగా ఒకటి ఆది వాసి పూజరులకు మిగిలిన మూడు సాధారణ భక్తులకు కేటాయించాలని పీఓ ఐటీడిఏ చక్రధర్ రావు కు సూచించారు.జాతరలో అక్రమ గుడుంబా ను అరికట్టాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. అదే విదంగా జాతర విధులకు హాజరైన 475 ఎక్సైజ్ అధికారులలో 40 మందిని ఆహార భద్రత శాఖకు అలాగే మరో 40 మందిని అటవీ శాఖ అధికారులకు కేటాయించి సమన్వయం తో పని చేయాలన్నారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి ఆరు బృందాలుగా ఏర్పడి రెండు షిఫ్టులగా ఏర్పడి తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఆహారానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. జంపన్న వాగు వద్ద 24 గంటలు నీరు రావాలని ఎక్కడ నీటి సమస్య తలెత్తిన సంబంధిత అధికారుల పై చర్యలు వుంటాయని తెలిపారు.
నోడల్ అధికారి వీపి గౌతమ్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి సెక్టార్ సింగిల్ నోడల్ పాయింట్ అని అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలని తెలిపారు. అన్ని సెక్టార్లలో కచ్చితంగా ఒక వైద్య శాఖ సిబ్బంది ఉండాలని డియంహెచ్ఓ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఓఎస్డి కృష్ణ ఆదిత్య ఏటూర్ నాగారం ప్రాజెక్ట్ అధికారి హనుమంతు కొండిబా జెడ్ , ఆదర్శ సురభి ,శ్రీ హర్ష జిల్లా పరిషత్ సీఈవో పారిజాతం , జిల్లా వైద్య శాఖ అధికారి అప్పయ్య. ఆర్డబ్ల్యూఎస్ అధికారి రామచంద్రనాయక్ జిల్లా పంచాయతీ అధికారి కె వెంకయ్య జిల్లా ఫైర్ అధికారి భగవాన్ రెడ్డి తదితరులు పాలుగొన్నారు.జాతర నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి:
మేడారం శ్రీ సమ్మక్క... సారాలమ్మ మహా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నందున ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు నోడల్ అధికారి వి.పి.గౌతమ్, ఏటూరు నాగారం ఐ.టి.డి.ఏ. పీవో హనుమంతు కొండిబా జడ్ ,సి.ఐ.డి. ఎస్పీ ఎం.శ్రీనివాస్ లతో పర్యటించారు.తొలుత ఐ.టి.డి.ఏ.క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎల్.సి.డి. టి.వి.ని తక్షణం తొలగించాలన్నారు. జంపన్నవాగు నుండి స్నానం చేసి వచ్చే వి.ఐ.పి. భక్తుల మార్గం కొరకు జంపన్నవాగు రహదారి నుండి దేవాలయం ముందుకు రాకుండా క్యూలైన్ ను క్యాంప్ కార్యాలయం వెనుక నుండి చిలకలగుట్ట రహదారి మీదుగా సారాలమ్మ ద్వారం గుండా నిర్మించే క్యూలైన్ వివరాలను అధికారులకు వివరించారు. సారాలమ్మ ఆర్చి వద్ద చెక్ పోస్ట్ ను పక్కాగా నిర్మించాలన్నారు. సదరు ఏర్పాట్లను కలెక్టర్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధాన ద్వారం నుండి ఎవరిని వెళ్లనీయరాదని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన క్యూలైన్ ద్వారానే పంపించాలన్నారు. దేవాలయం నుండి తాడ్వాయి వెళ్లే రహదారిలో నిర్మించే చెక్ పోస్ట్ కు అంబులెన్స్ వెళ్లేందుకు అనువుగా ఉండేలా నిర్మించాలని కలెక్టర్ ఆర్ అండ్ బి ఈఈ వెంకటేష్ ను ఆదేశించారు.
అనంతరం పోలీస్ క్యాంప్ వద్ద వి.వి.ఐ.పి.మార్గాన్ని పరిశీలించారు. ప్రతి మార్గానికి బోర్డ్స్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను పూజారులు కలువగా ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పూజారులు కోరిన విధంగా ఏర్పాట్లు చేస్తామని, ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా తప్పనిసరిగా అందిస్తామన్నారు. కలెక్టర్ వెంట దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఈఈ నరసింహారావు, ఆర్ అండ్ బి.ఈఈ వెంకటేష్, తదితరులు ఉన్నారు.
మేడారం జాతర పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్:
మేడారం శ్రీ సమ్మక్క... సారాలమ్మ మహా జాతర ను పురస్కరించుకొని వనదేవేతలయిన శ్రీ సమ్మక్క... సారాలమ్మ జీవిత చరిత్ర తో జాతర విశేషాలను పొందుపరిచి సమాచార పౌరసంబంధాల శాఖ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ , నోడల్ అధికారి వి.పి.గౌతమ్, ఏటూరునాగారం ఐ.టి.డి.ఏ.పీవో హనుమంతు కొండిబా జడ్ లు మంగళవారం ఐ.టి.డి.ఏ. క్యాంపు కార్యాలయం అతిధి గృహంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహజాతరైన మేడారం శ్రీ సమ్మక్క... సారాలమ్మ త్యాగాలు కోట్లాది భక్తులకు ఆరాధ్యదైవం అన్నారు. అటువంటి వీర వనితల అమ్మవార్ల జీవిత చరిత్రను విస్తృత ప్రచారం కొరకు ఈ పుస్తకాలు ఎంతో దోహదపడతాయన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఈ పుస్తకాల పంపిణీ చేయడం ద్వారా జీవిత చరిత్రల తో పాటు జాతర ప్రాముఖ్యత కూడా తెలిసే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు డి.ఎస్.జగన్, డి.పి.ఆర్.ఓ. ఎండి గౌస్, పౌరసంబంధాల అధికారి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.మేడారంలో బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు:
భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బిఎస్ ఎన్ ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్
మేడారంలో బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు అందిస్తున్నట్లు వరంగల్ బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. ఇందుకు 20 వై ఫై హాట్ స్పాట్స్ ను జాతర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సిగ్నల్స్ కు తాత్కాలికంగా 2G BTS-13, 3G BTS-14,4G BTS-1 ఇన్ స్టాల్ చేశామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.లాగిన్ విధానం:
మీ మొబైల్ ఫోన్ లో వైఫై ఆన్ చేయండి
QFI-BSNL-FREE-WIFI@Medaram కు కనెక్ట్ అవ్వండి
మీ ఫోన్ లో ఇంటర్నెట్ బ్రౌజర్ తెరవండి
వినియోగదారుడి మొబైల్ నెంబర్ నమోదు చేసి Log-in క్లిక్ చేయండి
నాలుగు అంకెల పిన్ నంబర్ నమోదు చేయండి, లాగిన్ పేజీ లో start Browsing క్లిక్ చేయండి
జాతర లో సెక్టార్ అధికారులు భక్తులకు అందుబాటులో ఉండాలి:
మేడారం శ్రీ సమ్మక్క... సారాలమ్మ మహా జాతర లో సెక్టార్ అధికారులు భక్తులకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టర్ జంపన్నవాగు పరిసర ప్రదేశాన్ని నోడల్ అధికారి వి.పి.గౌతమ్, ఏటూరునాగారం ఐ.టి.డి.ఏ.పీవో హనుమంతు కొండిబా జడ్ లతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.జంపన్నవాగు వద్ద ఎడమవైపు ఘాట్స్ పై ఏర్పాటు చేసిన ట్యాప్ లలో నీళ్లు రాక భక్తులు స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడటం కలెక్టర్ ప్రత్యక్షంగా చూసారు. అంతేగాక ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖ ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల తలుపులు విరిగి క్రింద పడి ఉండడంతో పర్యవేక్షణ కొరవడి ఉండడం ప్రస్ఫుటంగా కన్పించింది. సిబ్బంది కూడా లేకపోవడంతో ఒకింత అసహనానికి గురయ్యారు.
జాతర విధులు భక్తులకు సేవాలందించుటకే నన్నారు. కలెక్టర్ తక్షణమే అదే ప్రదేశం నుండి వాకి టాకీ ద్వారా సెక్టార్ అధికారులతో మాట్లాడుతూ వెంటనే ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను చేయాలన్నారు అధికారులు విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.