తమ మెగా సర్వీస్ క్యాంపును తిరుపతికి తీసుకువస్తోన్న జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్
మే 10 నుండి మే 11 వరకు జరగనున్న రెండు రోజుల సేవా శిబిరం నగరంలోని 2019-2020 జావా కస్టమర్‌లకు సేవలందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
· కస్టమర్లకు సహాయం చేయడానికి, ప్రముఖ ఒరిజినల్ పరికరాల తయారీదారులు కూడా శిబిరంలో పాల్గొననున్నారు.
తిరుపతి, 8 మే, 2024: జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్ తమ అత్యంత విజయవంతమైన మెగా సర్వీస్ క్యాంప్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి తీసుకువస్తోంది. ఈ కార్యక్రమం తిరుపతిలో మే 10 నుండి మే 11 వరకు జరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రాంతంలోని 2019 మరియు 2020 మోడల్‌ల జావా మోటర్‌సైకిల్ యజమానులకు ప్రత్యేకంగా సేవలను అందించనున్నారు.
ఈ సేవా శిబిరం తిరుపతిలో జోష్ మోటో - 100 సెంట్స్ , సర్వే . నం. 76/2, వార్తా పత్రిక కార్యాలయం ఎదురుగా మరియు నారాయణాద్రి హాస్పిటల్ ఎదురుగా, రేణిగుంట రోడ్, తిరుపతి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి , తిరుపతి సబ్ రెజిన్ వద్ద నిర్వహించబడుతుంది.
ఈ శిబిరంలో భాగంగా, 2019-2020 జావా మోటర్‌సైకిళ్ల యజమానులు సమగ్ర వాహన ఆరోగ్య తనిఖీకి మరియు ఎంపిక చేసిన విడిభాగాలను ఉచితంగా పొందడానికి అర్హులు.
జావా యెజ్డీ మోటర్‌సైకిళ్ల యజమానులు తమ వాహనాల సర్వీసింగ్ కోసం సమీప బ్రాండ్ డీలర్‌షిప్‌లో తమ స్లాట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.