ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు శుభవార్త!

Related image

  • సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ లో నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత వసతి

  • బోయినపల్లి వినోద్ కుమార్ లేఖతో స్పందన

  • ఉత్తర్వులు జారీ చేసిన ఎస్సీ అభివృద్ధి సంస్థ

హైదరాబాద్ బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్ డిజైన్ ( సిఐటీడి)లో నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి సౌకర్యాల కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వ పరంగా భరించేందుకు అనుమతినిస్తూ ఎస్సీ అభివృద్ధి సంస్థ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లేఖ నెంబర్ టీఆర్జి/1923/టి ఎస్ సి/2018, తేదీ 5-2-2020 ద్వారా సిఐటీడి డైరెక్టర్ కు ఎస్సీ అభివృద్ధి సంస్థ ఎండీ లచ్చిరాం భూక్య బుధవారం లేఖ రాశారు. బాలానగర్ లోని టూల్ డిజైన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పారిశ్రామికవేత్త, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి డిసెంబర్ 23న సందర్శించారు.

ఆ కేంద్రంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం వచ్చే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి సౌకర్యాలు లేని విషయాన్ని వినోద్ కుమార్ గమనించారు. విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు లేఖ రాశారు. మంత్రి ఆదేశాలతో టూల్ డిజైన్ కేంద్రంలో శిక్షణ పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుందని ఎస్సీ అభివృద్ధి సంస్థ ఎండీ లచ్చిరాం భూక్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని మర్రి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ లో నైపుణ్య అభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఉన్నా.. ఉచిత వసతి సౌకర్యాలు లేక తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ శిక్షణలో చేరలేకపోతున్న విషయాన్ని బోయినపల్లి వినోద్ కుమార్ గమనించి ఉచిత వసతికి చర్యలు తీసుకున్నారు.

More Press Releases