మనసుకి హత్తుకునేలా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి ‘సారా సారా’ పాట విడుదల
టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. ఆడియెన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాలను సైతం ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకులు హీరోలుగా.. హీరోలు దర్శకరచయితలుగా మారుతున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కూల్ అప్డేట్‌ను ఇచ్చారు. బయట ఉన్న కూల్ వెదర్‌కు తగ్గట్టుగా, మనసుకు హత్తుకునేలా, హాయినిచ్చేలా సాగే ఓ మెలోడీ పాటను వదిలారు. సారా సారా అంటూ సాగే ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రచించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. కార్తిక్ బి కొడకండ్ల ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేశారు.
తారాగణం: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి
నిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
DOP: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: ఉద్ధవ్ SB
సాంగ్స్ కొరియోగ్రఫీ : రాజ్ పైడి మాస్టర్
ఫైట్స్: నందు
PRO: ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)