ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్( AAA) నేషనల్ ప్రెసిడెంట్ గా బాలాజీ వీర్నాల
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) ఆంధ్రులచే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం స్థాపించబడిన మొదటి, ఏకైక జాతీయ స్థాయి సంస్థ. AAA, పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఏర్పడింది, ఆపై 10 రాష్ట్రాలకు విస్తరించబడింది. టీంకు జాతీయ నాయకత్వాన్ని తీసుకురావడానికి సమయం ఆసన్నమైంది. AAA అనుచరులందరికీ AAA జాతీయ అధ్యక్షుడిని పరిచయం చేయడం చాలా ఆనందంగా వుంది. ఏపీ అమెరికన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా బాలాజీ వీర్నాల ఎన్నికయ్యారు.
బాలాజీ వీర్నాల :
ఏపీలోని మచిలీపట్నం నుంచి వచ్చిన బాలాజీ వీర్నాల (Balaji Veernala) ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. IT రంగం, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధనాలు, ఫార్మా రంగం, విద్యా రంగాలలో విశేషమైన కృషి, సేవలని అందించారు. ఇప్పుడు మన్రో, New Jersey లో నివసిస్తున్నారు. సాధారణ, సామాన్య వ్యక్తి నుంచి అసాధారణ, అసమాన్య శక్తిగా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. సవాళ్లతో కూడిన మార్కెట్లలో విజయం సాధించడం బాలాజీ నాయకత్వానికి అద్దం పడుతోంది. వ్యాపారంలో విజయం సాధించడమే కాకుండా ఒక సలహాదారుగా కూడా రాణిస్తున్నారు. తన జ్ఞానాన్ని ఇతరులకు పంచి వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ, బాలాజీ తన స్వస్థలంలో అనేక దేవాలయాలను నిర్మించడం, పునరుద్ధరించడానికి పూనుకోవడంలో ఆయన చేసిన కృషి సంస్కృతి పట్ల ఆయనకున్న శ్రద్ధని తెలియజేస్తోంది. అతను నిరుపేద పిల్లల విద్యకు గణనీయమైన కృషి చేశారు. అనేక లాభాపేక్ష లేని సంస్థలకు ఆయన అందించిన సపోర్ట్ అతని నిబద్ధతకు అద్దం పడుతోంది. గొప్ప కాపు వారసుడు, నిజమైన మానవతావాది అయిన బాలాజీ దాతృత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్లో అతని క్రియాశీల పాత్ర ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రచారం చేయడంలో అతని అంకితభావాన్ని చూపుతోంది. కమ్యూనిటీ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, తెలుగు సంప్రదాయాలను నిలబెట్టడం ద్వారా తన మూలాలకు విధేయుడిగా వున్నారు.
ఏపీ అమెరికన్ అసోసియేషన్ (AAA)
ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఆంధ్ర ప్రదేశ్ యొక్క ప్రధాన సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్ర ప్రజలచే USAలో ఏర్పడిన ఒక లాభాపేక్షలేని సంస్థ. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లాల వరకు ఆంధ్రులందరినీ అమెరికాలో ఒక్కతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం. ఇది పూర్తిగా సాంస్కృతిక ఆధారితమైనది. భారతదేశంలో జరుపుకునే పండుగలలో ఆంధ్రులందరూ పాల్గొనాలి. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని మన పిల్లలకు ప్రపంచానికి చూపడం, AAA ఈవెంట్లు & వేడుకలలో భాగంగా మన పిల్లలు పాల్గొనడం, ఆపై వారు మా తరువాతి తరం నాయకులుగా ఎదగడం చూడటం. అలా చేయడానికి ఇదే సరైన సమయం. లేకుంటే మనం మన పండుగలను మరచిపోవచ్చు, మన పిల్లలకు మన ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి, పండుగలు, కళలు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు తెలియకపోవచ్చు.
మన తర్వాతి తరాలు USA లో మన ఇతర ప్రాంతీయ పండుగలు మన సంప్రదాయంగా భావిస్తూ పెరుగుతాయి. మన ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతిని కాపాడటం, USAలోని మన తర్వాతి తరాలతో పంచుకోవడం మన బాధ్యత. ఈ సందర్భంగా AAA నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల గారికి స్వాగతం పలుకుదాం. ఆయన దార్శని నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ను కొత్త శిఖరాలకు ఎదగడానికి మా అందరి సహాయ సహకారాలు అందిద్దాం.